Breaking News

ముస్లీమ్ సోదరుల అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం

-త్యాగానికి ప్రతీక రంజాన్..
-నూజివీడు ఈద్ గా త్వరలో మరింత అభివృద్ధి
-ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్రతకు, త్యాగానికి, మత సామరస్యానికి రంజాన్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. రంజాన్ సందర్బంగా నూజివీడు ముస్లీమ్ సోదరలు ఈద్గా పవిత్ర ప్రాంగణానికి వెళ్లి జిల్లా మరియు నూజివీడు ముస్లింలకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.సుమారు 5వేల మంది ముస్లీమ్ సోదరులను ఈద్గా నందు కలిసి పేరు పేరునా పలకరించి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి మాట్లాడుతూ ముస్లీం సోదరులందరూ కలిసి ఎంతో పవిత్రతో, భక్తిశ్రద్ధలతో, ఆనందంగా జరుపుకుంటున్న పండుగ రంజాన్ అన్నారు, నూజివీడు ఈద్గా అభివృద్ధి కి త్వరలో ప్రహరీ గోడ నిర్మస్తున్నట్లు, మరియు మేరకు పూడిక చేస్తున్నట్లు మంత్రి తెలిపారు, నూజివీడు పట్టణంలో గల మసీదు అభివృద్ధి కి 3 పేసు విద్యుత్ వెంటనే మంజూరు చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు, మసీదు మత గురువుకు నెలసరి జీతం ప్రభుత్వం తరపున వచ్చే ప్రయత్నం చేస్తానని మంత్రి అన్నారు, ముస్లీమ్ సోదరుల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు, ముస్లీమ్ సోదరులు త్యాగానికి సహాయానికి, మంచి చేయడానికి ముందు వరుసలో ఉంటారని మంత్రి అన్నారు, ముస్లీమ్ సోదరుల వాక్ బోర్డు అభివృద్ధి కి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు, ముస్లీమ్ సోదరుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశ పెట్టిందని ముస్లీం సోదరులందరూ సద్వినియోగం చేసుకోవాలని చూసించిన మంత్రి,ముస్లీమ్ సోదరులకు ప్రత్యేక రిజర్వేషషన్ కేటాయించి చట్టసభల్లో కి పంపి వారి అభివృద్దకి ఎంతో కృషి చేసిన పార్టీ తెలుగుదేశం,మత కలహాలు రూపు మాపి అన్ని మతాల వారు సోదర భావంతో స్వేచ్చా వాతావరణంలో జీవించేలా చేసిన పార్టీ తెలుగుదేశం అన్నారు,అల్లాహ్ దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అన్నారు, అల్లాహ్ దయ రాష్ట్ర ప్రజలందరిపై ఉండి ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి మంత్రి అన్నారు, ఈ కార్యక్రమంలో ముస్లీమ్ సోదరులు,మత పెద్దలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *