విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా చిట్టినగర్ మోతీ మసీద్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలలో వక్ఫ్ సవరణ చట్టంకు నిరసన తెలుపుతూ చేతికి నల్ల రిబ్బన్ కట్టుకొని వైఎస్సార్సీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇమామ్ ని కలిసి వారి ఆశీస్సులు తీసుకున్న మహేష్ మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు అల్లాహ్ ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కరిముల్లా, షేక్ ఎజాస్ (పండు), జిలాని, పిల్లా రవి, ప్రశాంత్, చిన్నారావు, సోమి.మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News