Breaking News

పశు బీమా – సవరించిన నిభందనలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము – పశు సంవర్ధక శాఖ ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయుచున్న పశు బీమా పధకము గుంటూరు జిల్లాలో కూడా అమలు చేయబడుచున్నది. గత సంవత్సరం అనగా 20024-25 లో ప్రభుత్వం విడుదల చేసిన ప్రీమియం మొత్తం రూ.17,00,000 ల తో ఇప్పటివరకు రూ.11,25,696 లను వినియోగించగా, 793 పశువులకు బిమచేయుట వలన 488 రైతులకు లబ్ధి చేకూర్చటం జరిగినది. ప్రస్తుతం ఈ ఆర్ధిక సంవత్సరము అనగా ఏప్రిల్ 1, 2025 నుండి రైతు వాటాని 20% నుంచి 15 % వరకు ప్రీమియం ను ప్రభుత్వం వారు తగ్గించారు.
క్రొత్తగా ప్రకటించిన బీమా నియమాలను అనుసరించి ఉదాహరణకు పాడి గేద/ఆవు విలువ రూ.30000 లు గా ఉంటే 3 సంవత్సరాలకి ప్రీమియం మొత్తం రూ.1920 లుగా నిర్ధారించి రైతు వాటా గా రూ288 లు మాత్రమే భరించాలసి ఉంటుంది. అదేవిదంగా ఒక గొర్రె / మేక / పంది కి సంబందించి బీమా గరిష్టంగా రూ.6000/- లకుగాను ప్రీమియం మొత్తం రూ.180/- లు ఉండగా 1 సంవత్సరానికి రైతు వాటాగా రూ.27లు, 2 సంవత్సరాలకి రూ 40లు, అదే 3 సంవత్సరాలకైతే రూ 56లు ప్రీమియంగా చెల్లించాలసి ఉంటుంది. తెల్ల రేషన్ కార్డుల వారికే కాకుండా అందరి రైతులకు ఈ బీమా వర్తిస్తుంది. గతంలో ఒక రైతు కి 5 పాడి పశువులు బీమా కి అర్హత గా ఉంటే ప్రస్తుతం 10 పాడి పశువులకు అవకాశం కల్పించారు. అదేవిదంగా గతంలో ఒక రైతుకీ 50 గొర్రెలు/మేకలు కు గరిష్ట పరిమితి ఉంటే ప్రస్తుతం 100 గొర్రెలు/మేకలు కు గరిష్ట పరిమితిని పెంచారు.
ఈ పశు బీమా పధకం ద్వారా పశువు ప్రమాదము వలన గాని, వ్యాధుల వలన గాని, లేదా ప్రకృతి వైపరీత్యాల వలన గాని మరణించిన చో ఈ బీమా వర్తిస్తుంది. కావున పశు పోషకులు ఈ పశు బీమా పధకం గురించి వివిద మండలాలలో ఉన్న పశు వైద్యశాలలు /గ్రామీణ పశు వైద్యశాలలు / రైతు సేవా కేంద్రంలలోని సిబ్బందిని సంప్రధించవలసినదిగా కొరడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *