Breaking News

ప్రభుత్వం పీజీ ఆర్ ఎస్ అర్జీలు నాణ్యతగా పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది

-పీజీఆర్ఎస్ నందు సమస్య పరిష్కారం అయిన అర్జీదారునితో ర్యాండంగా తనిఖీ నిర్వహించి ఆరా తీసిన సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్
-జెసి శుభం బన్సల్

కోట, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం పీజీ ఆర్ ఎస్ అర్జీల నాణ్యతగా పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించాలని తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పిజిఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం సకాలంలో అర్జీదారుల సంతృప్తి మేరకు క్షేత్రస్థాయిలో జరుగుతున్నాయా లేదా అని పరిశీలనలో భాగంగా నేడు గురువారం తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ గారు పీజీ ఆర్ ఎస్ అర్జీదారు అయిన కాపులూరు శ్రీహరి, కోట మండలం వాస్తవ్యులు తమ పొలం జాయింట్ ఎల్పిఎం నందు ఉన్నదని రీ సర్వే చేపట్టి తమ భాగం విభజించి చూపాలని పిజిఆర్ఎస్ నందు అర్జీ సమర్పించిన మేరకు సంబంధిత తహసిల్దార్ కోట వారు సకాలంలో పరిష్కరించారా సమస్య పరిష్కారమైందా అని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాతో కలిసి అర్జీదారుని గృహ సందర్శన చేసి ఆరా తీశారు. అర్జీదారు సంతృప్తికరంగా తమ సమస్య పరిష్కారానికి అధికారులు సకాలంలో చర్యలు చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట తాసిల్దార్ విఆర్ఓ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *