-పిజిఆర్ఎస్ ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో ప్రజలతో మాట్లాడి సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలి
-ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు చేరవేసే క్రమంలో క్షేత్ర స్థాయిలో అమలును ప్రత్యక్షంగా తెలుసుకుని, వాస్తవ పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, అప్పుడే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించ గలుగుతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , జోనల్ స్పెషల్ అధికారి అజయ్ జైన్ స్పష్టం చేశారు.
శుక్రవారం సాయంత్రం జిల్లా ప్రగతి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు అమలు, అమలు చేస్తున్న విషయం లో సమస్యలు పరిష్కారం తదితర అంశాలపై సమీక్షా నిర్వహిస్తూ, వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయ సాగు , పీఎం సూర్యఘర్, హౌసింగ్ , పీఎం విశ్వ కర్మ, గ్రిడ్ సిస్టమ్, స్వచ్చంద్ర (ఎస్ ఏ ఎస్ ఏ,) ఎక్సైజ్, జి ఎస్ టి, మున్సిపల్, పంచాయతి రాజ్, టూరిజం, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అజయ్ జైన్ మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాథమిక పథకాల అమలు తీరు పై అధికారులు దృష్టి పెట్టాలని అదే సమయంలో సమస్యలు ఎదురైతే వాటికి పరిష్కార మార్గాలు కూడా సూచించాలన్నారు. ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వడం ద్వారా మరింత సమర్థవంతంగా వాటిని ప్రజలకి అందించడం సాధ్యం అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి గృహ నిర్మాణాలు చేపట్టాలన్న సంకల్పం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. అందులో భాగంగానే గృహ నిర్మాణాల కోసం అతను ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఒక మంచి అడుగు రాష్ట్ర ప్రభుత్వం వేసిందన్నారు.
పర్యాటకపరంగా తూర్పు గోదావరి జిల్లాలో హోటల్స్ నిర్మాణాన్ని ప్రోత్సహించే క్రమంలో ఆసక్తి కలిగిన వారిని గుర్తించాలన్నారు. రాజమహేంద్రవరం లో, తూర్పు గోదావరి జిల్లాలో 5 వేల హోటల్స్ రూమ్ లు అందుబాటులోనికి తీసుకుని రావాల్సి ఉందన్నారు. పర్యాటక రంగంలో అందుబాటులో ఉన్న అవకాశాలు ఫలవంతం చెయ్యడం లో భాగంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి, అవగాహనా చేసుకోవడం జరిగిందన్నారు. వొచ్చే పర్యటన నాటికి నిర్ధిష్టమైన కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని , 2027 లో రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. అఖండ గోదావరి ప్రాజెక్ట్ పై అవగాహన కలిగిందని తెలిపారు.
వాట్సాప్ గవర్నెన్స్ 95523 00009 పై అన్ని వర్గాల ప్రజల్లో అవగాహన కల్పించండం కోసం విస్తృత ప్రచారం కల్పించడం, వాటిపై మాట్లాడం ముఖ్యం అన్నారు.
వ్యవసాయ రంగంలో ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం పెంచడం లో వాస్తవ పరిణామాలు కూడా పరిగణన లోనికి తీసుకోవడం ముఖ్యం అని అజయ్ జైన్ అన్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయ సాగు చేస్తున్న రైతు సేవా కేంద్రాల పరిధిలో గత మూడు ఏళ్లుగా అక్కడ ఎరువులు, పురుగు మందులు వినియోగం పై అధ్యయనం చేయాలని కోరారు. అప్పుడే వాస్తవంగా క్షేత్రస్థాయిలో ప్రకృతి వ్యవసాయ సాగు జరుగుతున్న వాటిని విశ్లేషణ చేయడం సాధ్యం అన్నారు.
పీఎం సూర్య ఘర్ పధకం అమలు చేయడం లో ఎస్సీ ఎస్టీ లబ్దిదార కుటుంబాలను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేయాలని ఆదేశించారు. బీబీఎల్ ( బిలో బేస్మెంట్ స్థాయిలో) లో ఇళ్ల లబ్ధిదారుల నుంచీ కూడా ప్రభుత్వం అందిస్తున్న అదనపు ఆర్ధిక సహాయం కోసం విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. అంగీకారం తెలియ చేసిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడం కోసం తగిన నిధులు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.
జిల్లా కలెక్టర్ బి ప్రశాంతి జిల్లా ప్రగతి పై వివరాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 15% జీవీఏ అభివృద్ధి దిశగా ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. వ్యవసాయ రంగంలో 15.57% హార్టికల్చర్ లో 16.33 పశుసంవర్ధక ద్వారా 19.76% అటవీ రంగంలో 0.16 శాతం, మత్స్య రంగంలో 2.92 శాతం మ్యానుఫ్యాక్చర్ రంగంలో 7.93 శాతం, వనరులు, నిర్మాణ రంగంలో 8.36 శాతం వృద్ధి రేటును సాధించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో అంతర పంటలను ప్రోత్సహించేదిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 33,000 ఎకరాల నుండి 47 వేల ఎకరాలకు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News