-309 విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ
-రూ. కోటి 38 లక్ష మేర సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త :
వచ్చే విద్య సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంత మంది చదువుకునే పిల్లులు ఉంటే వారి తల్లులకు ఏడాదికి రూ.15 వేలు చెప్పును ప్రభుత్వం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఏపీలో పాఠశాల విద్యను దేశంలో నం. 1 స్థానంలో నిలిపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు.
బాపట్ల జిల్లా అద్దంకిలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం నాడు 309 మంది విద్యార్థినులకు ఉచితంగా కొత్త సైకిళ్లను మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పంపిణీ చేశారు. చిలకలూరిపేటకు చెందిన ఆసిస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ సాయంతో సైకిళ్లను పంపిణీ చేసినట్లు మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ… విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేయడం ద్వారా వారికి చదువుల వైపు ప్రోత్సాహించినట్లవుతుందని అన్నారు. వివిధ కారణాల వల్ల పాఠశాల విద్యకు దూరమయ్యే బాలికల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉందని తెలిపారు. గతంలో ఇదే పాఠశాలలో కొంత మంది విద్యార్థినులకు సైకిళ్లు అందజేశామని చెప్పిన మంత్రి… విద్యార్థుల కోరిక మేరకు నేడు అందరికీ పంపిణీ చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే అద్దంకి నియోజకవర్గ పరిధిలోని పాఠశాలల విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం… విద్యా వ్యవస్థకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే ఒక రోల్ మోడల్ గా నిలిపేందుకు అన్ని చర్యలూ తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. విద్యార్థులందరూ కష్టపడి చదివి రాష్ట్రానికి మంచి పేరు తీసుకు రావాలని హితోపదేశం చేశారు. కార్యక్రమంలో అసిస్ట్ సంస్థ ప్రతినిధులతో పాటు విద్యా శాఖకు చెందిన అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
రూ.1.38 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…
అద్దంకి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం పరిధిలో శుక్రవారం నాడు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రజా వేదికను నిర్వహించారు. అక్కడికి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 89 మంది లబ్ధిదారులకు రూ.1.38 కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి గొట్టిపాటి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా… కూటమి ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అదే విధంగా బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడి కృషి చేస్తోందని వెల్లడించారు. సీఎం సహాయ నిధి ద్వారా చంద్రబాబు ఎంతో మందికి అండగా నిలుస్తున్నారని మంత్రి గొట్టిపాటి తెలిపారు. అదే విధంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News