విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇస్లాంపేట మౌలానా ఆజాద్ హైస్కూల్ లోని టీచర్ షేక్ నూర్జహాన్ కు సుజనా ఫౌండేషన్ ప్రతినెల పదివేల రూపాయల జీతం అందిస్తున్నారు. గతంలో బాపనయ్య స్కూల్లో పనిచేసి అనివార్య కారణాల వలన ఉపాధి కోల్పోయిన టీచర్ నూర్జహాన్ జీవనోపాధి కష్టం అవుతుండటంతో డీఎస్సీ అర్హత ఉన్న తనకు ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యే సుజనా చౌదరిని కోరారు. మౌలానా ఆజాద్ హైస్కూల్ లో ఉర్దూ మీడియం విద్యార్థులకు సేవలందించాలని సుజనా చౌదరి సూచించడంతో పాఠశాలలో ఉర్దూ టీచర్ గా తమ సేవలను అందిస్తున్నారు. అంతేకాకుండా సుజనా ఫౌండేషన్ వారు ప్రతి నెల రూ 10,000 వేల జీతాన్ని కూడా ఇస్తున్నారు. సోమవారం ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను అధ్యాపకురాలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఉపాధి కల్పించిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి టీచర్ నూర్జహాన్ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదములు తెలియజేశారు.
Prajavartha Online Telugu News