Breaking News

ఎన్డీఏ కార్యాలయంలో రూ 5 లక్షల ఎల్ఓసి పత్రం అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవానిపురం హెచ్ బీ కాలనీలో నివాసముండే పతంగి ఝాన్సీ కొంతకాలంగా కిడ్నీ మరియు ఊపిరితిత్తుల వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు మరింత మెరుగైన వైద్యం చేయాలని వైద్యులు సూచించారు. చికిత్సకు అయ్యే డబ్బు వారి వద్ద లేకపోవడంతో టిడిపి మాజీ కార్పొరేటర్ గుండారపు హరిబాబును సంప్రదించారు. ఆయన భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేయించారు. ఈ మేరకు సోమవారం మంజూరైన రూ 5 లక్షల ఎల్ఓసి (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాన్ని బాధితురాలు తనయుడు శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమినేతలతో కలిసి అందజేశారు. త్వరితగతిన చెక్కు మంజూరుకు సాయం చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపాడు. ఎన్డీఏ కూటమి నేతలు దుర్భేసుల హుస్సేన్, అలుగుండ్ల సుబ్బారెడ్డి, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *