Breaking News

ప్రతి పిటీషన్లు నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి పిటీషన్లు నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలని, ఎలాంటి సందర్భంలో కూడా బియాండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లకూడదని ఇన్చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ అధికారులకు సూచించారు.

సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇన్చార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు , లక్ష్మీ కుమారి , డిఆర్ఓ షేక్. ఖాజావలి , స్టెఫ్ సిఇఓ ఆర్. చంద్రముని , ఆర్డిఓ శ్రీనివాస రావు ప్రజల నుండి 235 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అనంతరం అధికారులతో ఇన్చార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన పిటీషన్లను గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలన్నారు. మరో 24 గంటల్లో గడువు ముగిసే పిటీషన్లు బియాండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్ళకుండా ముందుగా పరిష్కరించాలన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతగా పరిష్కరించాలన్నారు. శాఖల వారీగా పెండింగ్ దరఖాస్తులను ఇన్చార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ సమీక్షించి సూచనలు చేసారు. తమ సమస్యల పరిష్కారానికి వినతి పత్రం అందించేందుకు వచ్చిన దివ్యాంగుల వద్దకు స్వయంగా ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ చేరుకొని వారి వినతి పత్రాన్ని స్వీకరించి పరిశీలించారు. జిల్లా పరిధిలోని అంశాలను పరిష్కరిస్తామని , రాష్ట్ర స్థాయిలో పరిష్కరించే సమస్యలపై ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని వివరించారు.

ఈ సమావేశంలో జెడ్పి సిఇఓ జ్యోతిబసు , డ్వామా , హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్లు శంకర్, ప్రసాద్ , డిపిఓ బి.వి.నాగ సాయి కుమార్ , డియం అండ్ హెచ్ ఓ డా. విజయలక్ష్మీ , వికలాంగుల సంక్షేమ శాఖ ఏ.డి సువార్త , డి ఎస్ ఓ కోమలి పద్మ , ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్ విజయ్ ప్రకాశ్ , తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *