గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగుల యొక్క ఆస్తిపాస్తుల నిర్వహణ , ఫ్యామిలీ పెన్షన్ మొదలైనవి పర్యవేక్షించేందుకు వీలుగా మందపాటి ఉదయ సాగర్ మరియు కొత్తపల్లి రవిబాబు లను సంరక్షకులుగా నియమిస్తూ జారీ చేసిన లిమిటెడ్ గార్డియన్షిప్ సర్టిఫికేట్లను ఇన్ చార్జ్ జిల్లా కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ అందించారు. 2016 విభిన్న ప్రతిభావంతుల చట్టం ననుసరించి విభిన్న ప్రతిభావంతుల సాధికారితకు సూత్రాలను 2023 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. ఈ చట్ట పరిధిలో ఈ లిమిటెడ్ గార్డియన్షిప్ సర్టిఫికేట్ దివ్యాంగుల యొక్క ఆస్తిపాస్తుల నిర్వహణ , ఫ్యామిలీ పెన్షన్ మొదలైనవి పర్యవేక్షించుటకు సంరక్షకులను నియమించడం జరుగుతుందని ఇన్ చార్జ్ జిల్లా కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ ఈ సందర్భంగా తెలిపారు. ఈ విధమైన లిమిటెడ్ / లీగల్ గార్డియన్షిప్ సర్టిఫికేట్ కొరకు సంరక్షకుల విషయమై విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ గుంటూరు వారిని సంప్రదించవచ్చని తెలిపారు. ఈ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ ఒక ఏడాది పాటు వుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు , లక్ష్మీ కుమారి , డిఆర్ఓ షేక్. ఖాజావలి , స్టెఫ్ సిఇఓ ఆర్. చంద్రముని , ఆర్డిఓ శ్రీనివాస రావు , జెడ్పి సిఇఓ జ్యోతిబసు , వికలాంగుల సంక్షేమ శాఖ ఏ.డి సువార్త , డ్వామా , హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్లు శంకర్, ప్రసాద్ , డిపిఓ బి.వి.నాగ సాయి కుమార్ , డియం అండ్ హెచ్ ఓ డా. విజయలక్ష్మీ , డి ఎస్ ఓ కోమలి పద్మ , ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్ విజయ్ ప్రకాశ్ , తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News