Breaking News

వెట్టిచాకిరి ఘటనపై ఎస్టీ కమిషన్ చైర్మన్ ఆగ్రహం

-నివేదిక కోరిన చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాపట్ల జిల్లా రేపల్లె మండలం బొబ్బర్లంకకు చెందిన ఎస్టీ సామాజిక వర్గ దంపతుల వెట్టి చాకిరీ ఘటనపై జిల్లా అధికారులు సమగ్ర నివేదిక పంపాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు ఆదేశించారు. తమను వెట్టిచాకిరి చేయిస్తున్నారంటూ నంబూరు పద్మ, అగ్ని దంపతులు ఇచ్చిన ఫిర్యాదు పై స్పందించిన బాపట్ల కలెక్టర్ ను చైర్మన్ అభినందించారు.వెట్టిచాకిరి చేయించడంతో పాటు, దంపతులను అమ్మకానికి పెట్టడంపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ కాలంలో కూడా వెట్టిచాకిరి చేయించేందుకు యత్నించడం దారుణమన్నారు.ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి నివేదికను బాపట్ల జిల్లా అధికారులు వెంటనే కమిషన్ కు సమర్పించాలని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *