విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణ నది తీరాన శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమాపనోత్సవాలు ప్రారంభమైన సందర్భంగా నగరంలోని బబ్బూరి గ్రౌండ్స్ లో శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్ర సేవ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సంఘం కార్యదర్శి దూపుగుంట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ…. పెనుమాక గ్రామంలో కల శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్రంలో 365 రోజులపాటు 365 రోజులపాటు అఖండ శ్రీ హనుమాన్ పారాయణ కార్యక్రమం నిర్వహించమన్నారు. ముగింపు కార్యక్రమానికి సంకేతంగా బాబూరి గ్రౌండ్స్ లో ఈ నెల 7 నుండి 13 వ తేదీ వరకు 50 వేల మంది భక్తులతో హనుమాన్ చాలీసా పారాయణం ఏర్పాటు చేశామన్నారు. శ్రీవారి నమూనా ఆలయాన్ని రూపొందించి తిరుమల తరహాలో ఉదయాస్తమాన సేవలు నిర్వహిస్తున్నామని అన్నారు. . ఏడాది పాటు నిర్విరామంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసిన భక్తులను అయోధ్య రామమందిర దర్శనానికి తీసుకువెళ్తామని చెప్పారు.
అనంతరం ప్రముఖ గాయకులు ఎం.ఎస్ రామారావు మనువడు ఎం.ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ…ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటల నుండి 8 గంటల వరకు సుందరకాండ, హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని వివరించారు.శ్రీవారి నమూనా ఆలయాన్ని రూపొందించి తిరుమల తరహాలో ఉదయాస్తమాన సేవలు నిర్వహిస్తూ శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్ర సేవ సంఘం ఇంతటి బృహత్తర కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయం అన్నారు.
Prajavartha Online Telugu News