Breaking News

క్రికెట‌ర్ వెలుగోటి రాజ‌గోపాల్ యాచేంద్ర సేవ‌లు చిరస్మరణీయం

-యాచేంద్ర మృతికి సంతాపం తెలిపిన ఏసీఏ అధ్య‌క్షుడు ఎంపి కేశినేని, ఏసీఏ కార్య‌ద‌ర్శి రాజ్య‌స‌భ ఎంపి సానా

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ ఆంధ్రా రంజీ క్రికెట్ టీమ్ కెప్టెన్ వెలుగోటి రాజ‌గోపాల్ యాచేంద్ర (93) మృతి పై . ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్అధ్య‌క్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఏసీఏ కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ ఎంపి సానా స‌తీష్‌ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. ఆయ‌న మ‌ర‌ణం ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రికెట్ రంగంలో తీర‌ని లోట‌ని ఏసీఏ అధ్య‌క్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) గురువారం విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. యాచేంద్ర వ‌యోభారం కార‌ణంగా నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరిలో గురువారం మృతి చెందారు.

రాజ‌గోపాల్ యాచేంద్ర‌ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని కోరుకుంటూ శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ఏసీఏ త‌రఫున ఏసీఏ అధ్య‌క్షుడు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని),రాజ్య‌స‌భ ఎంపి సానా స‌తీష్‌ తన ప్రగాఢ సానుభూతి తెలియజేయటంతోపాటు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరికి చెందిన యాచేంద్ర ఆంధ్ర రంజీ క్రికెట్ టీమ్ లో 1956 నుంచి 1965 మ‌ధ్య 15 రంజీ ట్రోఫీ మ్యాచ్ ల్లో బ్యాటింగ్ తో పాటు లెగ్ బ్రేక్ బౌలింగ్ చేసి ప్ర‌తిభ గ‌ల‌ క్రికెట‌ర్ గా గుర్తింపు తెచ్చుకోవ‌టంతో పాటు 1963 నుండి 1965 వరకు ఆంధ్ర జట్టుకు నాయకత్వం వహించారన్నారు. ఆంధ్ర రంజీ క్రికెట్ టీమ్ లో ఆడి ఎంతో మంది క్రికెట్ క్రీడాకారులకు ఆద‌ర్శంగా నిలిచార‌ని పేర్కొన్నారు. బ‌హుముఖ క్రీడా సామర్థ్యాలతో క్రికెట‌ర్ గానే కాకుండా టేబుల్ టెన్నిస్ లో కూడా అగ్రశ్రేణి ఆట‌గాడిగా మంచి గుర్తింపు పొందిన యాచేంద్ర నేటిత‌రం క్రీడాకారుల‌కు ఆద‌ర్శమ‌న్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *