శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న ఎంపి కేశినేని శివ‌నాథ్

-కుటుంబ స‌మేతంగా ప్ర‌త్యేక పూజ‌లు

శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర దేవాలయాన్ని గురువారం కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్నారు. త‌న స‌తీమ‌ణి కేశినేని జాన‌కీ ల‌క్ష్మీ, కుమారుడు వెంక‌ట్ తో క‌లిసి శ్రీవాయు లింగేశ్వర స్వామి సమేత జ్ఞాన ప్రసూనాంబికా దేవిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. వీరికి ఆల‌య అధికారులు ఆల‌య మ‌ర్యాద‌ల‌తో స్వాగ‌తం ప‌లికి స్వామివారి ద‌ర్శ‌నం క‌ల్పించారు. అనంత‌రం ఆస్థాన మండ‌పం నందు స్వామి వారి శేష వ‌స్త్ర‌ము, తీర్థ ప్ర‌సాదాలు, స్వామి వారి చిత్ర‌ప‌టాన్ని అంద‌జేశారు. వేద పండితులు, వేద మంత్రోచ్చారణలతో ఆశీర్వదించారు. ద‌క్షిణ భారతదేశంలో ద‌క్షిణకాశీగా ఖ్యాతిగాంచిన‌ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీవాయు లింగేశ్వర స్వామి సమేత జ్ఞాన ప్రసూనాంబికా దేవిని ద‌ర్శించుకోవ‌టం ఎంతో సంతోషంగా వుంద‌న్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స‌హ‌కారంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నాయ‌కత్వంలో రాష్ట్రం అభివృద్ది ప‌థంలో ముందుండాల‌ని ప్రార్ధించిన‌ట్లు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *