Breaking News

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న ఎంపి కేశినేని శివ‌నాథ్

-కుటుంబ స‌మేతంగా ప్ర‌త్యేక పూజ‌లు

కాణిపాకం, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గంలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవ‌స్థానంలోని స్వామి వారిని గురువారం కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్నారు. త‌న స‌తీమ‌ణి కేశినేని జాన‌కీ ల‌క్ష్మీ, కుమారుడు వెంక‌ట్ తో క‌లిసి శ్రీవ‌ర‌సిద్ధి వినాయ‌క స్వామి వారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొన్నారు. వీరికి ఆల‌య అధికారులు ఆల‌య మ‌ర్యాద‌ల‌తో స్వాగ‌తం ప‌లికి స్వామివారి ద‌ర్శ‌నం క‌ల్పించారు. అనంత‌రం ఆస్థాన మండ‌పం నందు స్వామి వారి శేష వ‌స్త్ర‌ము, తీర్థ ప్ర‌సాదాలు, స్వామి వారి చిత్ర‌ప‌టాన్ని అంద‌జేశారు. వేద పండితులు, వేద మంత్రోచ్చారణలతో ఆశీర్వదించారు. దేశంలోనే విఘ్నేశ్వ‌రుడి ఆల‌యాల‌లో ఎంతో ప్ర‌సిద్ధ‌మైన, వెయ్యేళ్ల చ‌రిత్ర వున్న‌ కాణిపాకం వ‌ర‌సిద్ధి వినాయ‌క స్వామివారిని కుటుంబ‌స‌మేతంగా ద‌ర్శించుకోవ‌టం ఎంతో ఆనందంగా వుంద‌న్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు బాగుండాలని ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ప్రార్థించినట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *