-జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
16వ ఆర్థిక కమిషన్ ఈ నెల 17, 18 రెండు రోజులు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలి అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు 16వ ఆర్థిక కమిషన్ పర్యటన ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో 16వ ఆర్థిక కమిషన్ రెండు రోజులు పర్యటించనున్నారని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని తెలిపారు. 17 వ తేది ఉదయం 11 గంటలకు ఆర్థిక కమిషన్ 15 మంది డెలిగేట్స్ తిరుపతి ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారని, ప్రోటోకాల్, బందోబస్తు, సెక్యూరిటీ పగడ్బందీగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (లా అండ్ ఆర్డర్)రవి మనోహర చారి, డి ఆర్ ఓ నరసింహులు, జడ్పీ సీఈవో రవి కుమార్ నాయుడు, సి పి ఓ ప్రేమచంద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News