Breaking News

వైభవంగా అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరం దేవీనగర్ మధ్యకట్ట విజయదుర్గా నగర్ లోని శ్రీ విజయదుర్గాదేవీ సమెత విజయేశ్వర స్వామి ఆలయంలో ‘అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ’ శుక్రవారం భక్తజన సందోహం నడుమ కన్నులపండువగా జరిగింది. ఈ వేడుకలలో వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠతో ఈ ప్రాంతం కొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందని మల్లాది విష్ణు అన్నారు. శబరిగిరీశునికి విశిష్ట పూజలు నిర్వహించడం ఎంతో మహాభాగ్యమని పేర్కొన్నారు. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఆ అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తదనంతరం భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *