Breaking News

రాష్ట్రంలో కొందరు ఐ.ఏ.ఎస్.లు సహచర ఉద్యోగులను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు…

-అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో కొందరు ఐ.ఏ.ఎస్.లు సహచర ఉద్యోగులను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని ఈ విధానాలను మానుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ హెచ్చరించారు. శ‌నివారం విద్యాధరపురంలోని రాష్ట్ర సంఘ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ 95% మార్గదర్శకులుగా నిలుస్తున్నారని 10 శాతం మాత్రమే ఉద్యోగుల్లో ఘర్షణ వాతావరణం నెలకొల్పుతున్నారని వెల్లడించారు. ఉద్యోగస్తులు సంఘం ఆధ్వర్యంలో జూన్ నెలలో పెద్ద ఎత్తున కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు హాజరవుతారని చెప్పారు. 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వంలో ఉద్యోగస్తుల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతిన్నాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉందని అయినా ఆర్థిక లోటు ఉండటంవల్ల ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేకపోతున్నామన్నారు. వేతన సవరణ విషయంలో సెట్టింగ్ న్యాయమూర్తులు ముగ్గురితో కమిషన్ వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. గతంలో ఉద్యోగస్తుల సర్వీస్ వ్యవహారాల కోసం ఏర్పాటుచేసిన వ్యవస్థ నేడు నిర్వీర్యం అయిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో మార్పులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 95 శాతం ఐఏఎస్లు మార్గదర్శకంగా ఉన్నారని, పది శాతం ఐఏఎస్లు అన్ని నిబంధనలకు అతీతంగా వ్యవహరిస్తూ ఉద్యోగస్తుల్లో ఘర్షణ వాతావరణం నెల కొల్పుతున్నారన్నారు. ఈ విధానం శృతిమించితే పోరాటాలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇవ్వకపోయినా పరిశీలిస్తామని హామీ ఇచ్చారని ఈ అంశం మీద ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. అధిక సంఖ్యాబలం కలిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఘం ఆధ్వర్యంలో జూన్ లో కౌన్సిల్ సమావేశాలు నిర్వహించనున్నామనిఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో పాటు పలువురు మంత్రులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ కుమార్ తో పాటు సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *