Breaking News

విశ్యశాంతి కొరకు హనుమాన్‌ చాలీసా పారాయణం మహా యజ్జం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విశ్యశాంతి కొరకు భారత దేశం సుభిక్షంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో దత్త పీఠం అధిపతులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సాముహిక హనుమాన్‌ చాలీసా పారాయణం మహా యజ్జం చేస్తున్నారు. దీనిని పురస్కరించుకుని శనివారం పటమట, శీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శీ గణపతి సచ్చిదానంద స్వామీ మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం 6 గంటలకు విజయవాడలో భవానీపురంలోని పున్నమి ఘాట్‌ వద్ద బబ్బూరి గ్రౌండ్‌ నందు వేల మంది భక్తులతో కలసి ఏక కాలం చాలీసా పారాయణం చేసి భగవంతుని ప్రార్థిస్తూ విశ్య శాంతి కొరకు భారత దేశం పాడి పంటలతో ఆర్ధికాభివృద్ది చెందాలనే సంకల్పంతో మహ యజ్జం చేస్తున్నట్లు తెలిపారు. 33గంటల 33 నిమిషాలపాటు మైసూర్‌లో హనుమాన్‌ చాలీసా కదలకుండా పారాయణము చేసి గిన్నిస్‌ రికార్డ్‌ చేశామన్నారు. హనుమంతుడు కార్యసిద్ధి చేకూరుతాడు. హనుమంతుడు రాముల వారి కష్టాన్ని సీతమ్మ వారి కష్టాలను తీర్చిన అత్యంత శక్తి శాలి. హనుమంతుని కీర్తించి వేడుకుంటే ఆదే ప్రదేశంలో తాను ఏదో రూపంగా వచ్చి భక్తులను కాపాడుతాడన్నారు. హనుమాన్‌చాలీసాను ఒక మహ యజ్జం చేసుకోని ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వేల మంది భక్తులతో ఏక కాలం ముక్తకంఠంతో సాముహికంగా చాలీసాను గానం చేసాం. మన దేశంతో పాటు విదేశాల్లో కూడా యువకులు హనుమాన్‌ చాలీసా పారాయణం చేస్తున్నారన్నారు. అమెరికాలోని డల్లాస్‌లో హనుమాన్‌ టెంపుల్‌ నిర్మాణం జరిగింది. హిందువులుగా అమెరికా వాసులు అనేక మంది ఆ ఆలయాన్ని సందర్శించి స్వామికి ముడుపు కట్టి తమ కోర్కెలను తీర్చమని వేడుకుంటున్నారన్నారు. హనుమంతుడిని మనం నిత్యం వహించాల్సిన అవసరం ఉందన్నారు. మహా విష్ణు తర్వాత హనుమంతుడే అని తెలిపారు. పున్నమి ఘాట్‌లో 18 సార్లు హనుమాన్‌ చాలీసా పఠనం జరుగుతుందన్నారు. మధ్య మధ్యలో సుందరకాండ వివరిస్తామన్నారు. ప్రతి ఒక్కరు హాజరై సామూహిక హనుమాన్‌ చాలీసాలో పాల్గొనాలని కోరారు. స్వామికి చాలా ముఖ్యమైన ఈ రోజు సామూహిక హనుమాన్‌ చాలీసాలో పాల్గొనటం మంచిందని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *