Breaking News

తూర్పుగోదావరి జిల్లా సీతంపేట దగ్గర గోదావరిలో ఇద్దరు యువకులు గల్లంతు

-సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించిన మంత్రి కందుల దుర్గేష్
-ఎస్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లు, ఫైర్, మత్స్య శాఖ సిబ్బంది, పోలీసుల సాయంతో మృతదేహాల కోసం గాలింపు
-గల్లంతైన యువకులు ప్రవీణ్ (15), హర్ష(18) లు నిడదవోలు, రాజమండ్రికి చెందిన వారిగా గుర్తింపు
-బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి దుర్గేష్ హామీ
-ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడి

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నిడదవోలు పట్టణం చెంచు పేటకు చెందిన ఇద్దరు యువకులు ప్రవీణ్ (15), హర్ష(18) లు విజ్జేశ్వరం సమీపంలోని సీతంపేట – మద్దూరులంక బ్యారేజ్ దగ్గర గోదావరిలో ఈతకు దిగి గల్లంతవడం బాధాకరమని మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం విషయం తెలియగానే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్ కాకినాడలోని ఎస్డీఆర్ఎఫ్ బృందం,స్థానికంగా ఉన్న గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది, మత్స్యశాఖ సిబ్బంది, పోలీసుల సాయంతో దాదాపు గంటకు పైగా గాలింపు చర్యలు చేపట్టారు. లోతు దాదాపు 100 అడుగులు ఉండటం వల్ల యువకుల జాడ ఇంకా తెలియలేదని, గాలింపు చర్యలను తీవ్రతరం చేశామని వివరించారు. ఎంత ఆలస్యమైనా గల్లంతైన యువకులను వెలికితీసి తీరుతామన్నారు. ఇప్పటికే ఆదేశాలు జారీ చేశానన్నారు. బంగారు భవిష్యత్ ఉన్న ఇద్దరు చిన్నారులను చిన్నవయసులో గల్లంతు కావడం తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమన్నారు. వారి ఆవేదన చూస్తుంటే గుండె తరుక్కుపోయేలా చేసిందన్నారు. ఈ విషయమై ఇప్పటికే సీఎంవో స్థాయి అధికారులతో చర్చించామని మంత్రి దుర్గేష్ తెలిపారు. ప్రభుత్వ సాయంతో సహాయక చర్యలను ముమ్మురం చేశామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావతృతం కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి దుర్గేష్ అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు చదువుతో పాటు భద్రతా చర్యలు ఏ రకంగా ఉండాలి, నివారణ ఏంటి అనే తదితర అంశాలపై పాఠశాల, కళాశాల స్థాయుల్లోనే అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని వెల్లడించారు. ప్రతి ఏటా ఈ తరహా ఘటనలు రివాజుగా మారడం బాధాకరంగా ఉందన్నారు. గోదావరి పరిసర ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాబోయే రోజుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు, సమాజంలో పౌరులకు ఈ అంశాలపై అవగాహన కల్పించాలన్నారు.

వివరాల్లోకి వెళ్తే ప్రవీణ్ పదో తరగతి, హర్ష ఇంటర్మీడియట్ చదువుతున్నారు. వీరిద్దరూ మరికొంతమంది యువకులతో కలిసి విజ్జేశ్వరం దగ్గర సీతంపేట-మద్దూరులంక సమీపంలో గోదావరిలో స్నానానికి దిగారు.నది లోతు తెలియక లోపలికి వెళ్లి మునిగి గల్లంతయ్యారు. గల్లంతైన ఇద్దరు యువకుల్లో ప్రవీణ్ తండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. తల్లి కువైట్ లో ఉంది. వారికి విషయం చేరవేశాం. మరో యువకుడు హర్ష తల్లి రాజమండ్రిలో నర్స్ గా పనిచేస్తుందని తెలిసిందని మంత్రి దుర్గేష్ విషయాలను మీడియాకు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు హృదయవిదారకమని, ఏ తల్లిదండ్రులకూ తమ కళ్లముందే పిల్లల్ని కోల్పోయే పరిస్థితి రాకూడదని బాధాతప్త హృదయంతో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *