-అవకాశాలు అందిపుచ్చుకొని అంబేద్కర్, జగజీవన్ రామ్, జ్యోతిరావు ఫూలే ఆశయాలు కొనసాగించాలి
-నమస్కారం చేయడం ద్వారా వారికి కృతజ్ఞత కలిగి ఉండాలి
-సంయుక్త కలెక్టర్ ఎస్ చిన్న రాముడు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఏప్రియల్ 12 న విడుదల చేసిన ఇంటర్మీడియేట్ పరీక్షా ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా నందలి సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ఆదర్శంగా నిలిచారని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. సోమవారం స్థానిక గోకవరం బస్టాండ్ సమీపంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలు సందర్భంగా ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థినులను అభినందించి ప్రశంసా పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాములు మాట్లాడుతూ వివిధ గ్రామీణ ప్రాంతాలలో పదవ తరగతి పూర్తి చేసుకొని కళాశాల విద్యను అభ్యసించి తూర్పుగోదావరి జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల వసతి గృహలలోని విద్యార్థులు సాధించిన ఫలితాలలో బాలికలు ముందంజలో ఉండడం అభినందనీయం అన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగం వలన నేడు స్వేచ్ఛగా విద్యను అభ్యసిస్తూ స్వేచ్ఛగా జీవిస్తున్నామని, అందుకు కృతజ్ఞత గా,నమస్కారం చేయడం ద్వారా వారికి కృతజ్ఞత తెలియ చెయ్యాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు కోరారు.
ఈ సంవత్సరంలో మొదటి ఇంటర్మీడియేట్ సంవత్సరం గాను అత్యధిక మార్కులు గోలి మౌనిక 423/500, (సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం -2, రాజమహేంద్రవరం) , ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం గాను అత్యధిక మార్కులు సాధించిన మద్దల సుశీల 910/1000, (సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం -2, రాజమహేంద్రవరం) విద్యార్ధినులు సాధించారని వారికి అభినందనలు తెలియచేశారు. ఉత్తమ ఫలితాలు సాధించడంలో తర్ఫీదు ఇచ్చిన ఉపాధ్యాయులు, తల్లితండ్రులు, వసతి గృహాల నిర్వాహకుల కృషి చెయ్యడం జరిగిందని తెలిపారు.
తదుపరి వచ్చే విద్య సంవత్సరంలో ఇంకా మెరుగైన పలితాలు సాదించేలా కృషి చేస్తామని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం ఎస్ శోభా రాణి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యం. యస్. శోభారాణి, అదనపు ఎస్పీ మురళీకృష్ణ ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులను అభినందించి ప్రశంసా పత్రం అందజేశారు.
అనంతరం దాతల సహకారంతో చీరలు పంపిణీ చేయడం జరిగింది.
Prajavartha Online Telugu News