కోటి సభ్యత్వాలు కలిగిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశమే

-సంక్షేమం, అభివృద్ధికి చిరునామా తెలుగుదేశం పార్టీ
-ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం
-సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్

పర్చూరు, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ చరిత్రలో అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కోటి సభ్యత్వాలు కలిగిన ఏకైక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు మం. భీమవరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థానిక శాసన సభ్యులు ఏలూరు సాంబశివరావు తో కలిసి మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ…. అన్న నందమూరి తారక రామారావు ఏ ముహుర్తాన తెలుగుదేశం పార్టీని స్థాపించారో కానీ ఇప్పటి వరకు దిగ్విజయంగా దేశం రాజకీయాల్లో టీడీపీ దూసుకుపోతుందని పేర్కొన్నారు. 43 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీని ఎంతో మంది దెబ్బ కొట్టాలని ప్రయత్నించారని మంత్రి గొట్టిపాటి ఆరోపించారు. అయితే దెబ్బకొట్టాలని ప్రయత్నించిన ప్రతీ సారి టీడీపీ ప్రభంజనంలో వాళ్లే కొట్టుకుపోయారని గుర్తు చేశారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుని అరెస్టు చేసి కార్యకర్తలు మనోస్థైర్యం పై దెబ్బ కొట్టాలని వైఎస్ఆర్సిపి నాయకులు ప్రయత్నించారని మంత్రి గొట్టిపాటి తెలిపారు. క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తల మద్దతుతో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రెట్టింపు ఉత్సాహంతో వచ్చిందని మంత్రి గొట్టిపాటి అన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని తెలిపిన మంత్రి గొట్టిపాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రతి పర్యటనలోనూ కార్యకర్తలతో సమావేశమై వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నట్లు పేర్కొన్నారు. ఒక వైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూనే మరో వైపు అభివృద్ధి సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. తెలుగోళ్లకు గుర్తింపు తెచ్చిన ఘనత నందమూరి తారక రామారావు ది అయితే తెలుగోళ్ల ప్రతిభను విశ్వవ్యాప్తం చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందని మంత్రి గొట్టిపాటి చెప్పారు. తెలుగుదేశం పార్టీ పేదోడికి పట్టడం పెట్టిన పార్టీగా చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి గొట్టపాటి అన్నారు. అన్న ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రభుత్వాలు మారిన ఇప్పటికీ కొనసాగిస్తున్నాయని మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. పేదోడి ఆకలి తీర్చే దిశగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి కేవలం ఐదు రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టిన పార్టీ టీడీపీయే అన్నారు. సంక్షేమం, అభివృద్ధి అనే రెండు పదాలకు తెలుగుదేశం పార్టీ చిరునామాగా నిలుస్తోందని మంత్రి గొట్టిపాటి విశ్వాసం వ్యక్తం చేశారు.

సంక్షేమానికి మాత్రమే కాకుండా సాంకేతికతకు కూడా అను తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సాంకేతికత అందుబాటులో ఉన్న గాని దాన్ని అంది పుచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముందు ఉంటారని గుర్తు చేశారు.

కేంద్ర ప్రాయోజిత పథకాలైన పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ లాంటి పథకాలను ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించుకుంటుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా విద్యుత్ వినియోగదారులను విద్యుత్ ఉత్పత్తిదారులుగా మార్చే దిశగా టిడిపి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. దీని ద్వారా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నట్లు మంచి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రైతులకు ఆర్థిక సాయం అందించే దిశగా తెలుగుదేశం పార్టీ అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడాను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు టిడిపి కృషి చేస్తుందని చెప్పారు. భారతదేశంలోనే అత్యధిక పెన్షన్ పంపిణీ చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలిచిందని మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *