-కూటమి నేతలతో కలిసి అందించిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన ఎల్ఓసి (లెటర్ ఆఫ్ క్రెడిట్ ) పత్రాలను గురువారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. 46వ డివిజన్ అలీ నగర్ కు చెందిన సాధిక్ హుస్సేన్( 47 )గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరింత మెరుగైన వైద్యం నిమిత్తం ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా రూ 5, లక్షల 50, వేల ఎల్ఓసి ను బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. త్వరితగతిన ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News