గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. గురువారం బుడంపాడు, నగరాలు, గోరంట్ల తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల పై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో విలీనమైన గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన పట్ల ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇప్పటికే స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజల అభిప్రాయాల మేరకు సిసి రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేస్తున్నామన్నారు. కార్మికులను రేషనలైజేషన్ ద్వారా పారిశుద్య పనుల మెరుగుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాలో సమస్యలు, అంతరాలు గుర్తించామని ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జరీ చేశామన్నారు. అలాగే బుడంపాడులో గత పర్యటనలో ఆదేశించిన పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకొని, ఆయా పనుల్లో జాప్యంపై ఇంజీనిరింగ్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. సిసి రోడ్లు డ్రైన్ నిర్మాణం అనంతరమే చేపట్టాలన్నారు.
పర్యటనలో డిఈఈ రమేష్ బాబు, ఎస్ఎస్ సోమశేఖర్, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News