ర్యాలీ, ఫోటో ఎగ్జిబిషన్, స్టాల్స్ ప్రదర్శన, ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ పై అవగాహన కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణాంధ్ర – స్వచ్చాంద్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19వ తేదీ (శనివారం) ఉదయం 9గంటలకు కలెక్టరేట్ నుండి శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు ర్యాలీ జరుగుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ర్యాలీ అనంతరం 10 గంటలకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఫోటో ఎగ్జిబిషన్, స్టాల్స్ ప్రదర్శన, ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ పై అవగాహన కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రెటరి కె.విజయానంద్, స్వచ్చాంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి రామ్, జిల్లా కలెక్టర్ కె.నాగలక్ష్మీ, ఎంఎల్సీలు, ఎంఎల్ఏలు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారన్నారు. నగర ప్రజలు కూడా తమ ఇళ్లల్లో నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను శనివారం విజ్ఞానమందిరంలో ఏర్పాటు చేసే ప్రత్యేక స్టాల్స్ ల్లో అందించి తగిన రశీదు పొందాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *