-ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్‌లోని ప్రపంచంలోనే మొట్టమొది సమైఖ్య పునరుత్పాదక ఇంధన నిల్వను సందర్శించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన మరియు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు సమీపంలోని పిన్నాపురంలో ప్రపంచలోనే మొట్టమొదటి మరియు అతిపెద్ద జీడబ్ల్యూ-స్కేల్ సమైఖ్య పునరుత్పాదక ఇంధక ప్రాజెక్ట్‌ని సందర్శించి, దాని స్థాయి మరియు వేగవంతమైన పురోగతిని ప్రశంసించారు. 4.2 బిలియన్ యూఎస్‌డీ ప్రాజెక్టులో 4000 MW సౌరశక్తి, 1000 MW పవనశక్తి మరియు 1680 MW పంప్ చేయబడిన జలవిద్యుత్ ఉత్పత్తి ఉన్నాయి. దీనిని ప్రపంచంలోని ప్రముఖ ఇంధన పరివర్తన మరియు డీకార్బనైజేషన్ సొల్యూషన్స్ కంపెనీ గ్రీన్కో ఏర్పాటు చేసింది. ఒకే సైకిల్‌లో రోజుకు 10,080 MWh నిల్వ సామర్థ్యంతో, డిస్పాచబుల్, కార్బన్ రహిత శక్తి ఉత్పత్తితో, పిన్నాపురం ప్రాజెక్ట్ గ్రీన్ స్టీల్, గ్రీన్ అల్యూమినియం మరియు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి పరిశ్రమలకు మద్దతు ఇస్తుంది.
ఈ సందర్భంగా మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ‘‘ప్రపంచంలోనే మొట్టమొదటి మరియు అతిపెద్ద సమైక్య పునరుత్పాదక ఇంధన నిల్వ ప్రాజెక్ట్, పిన్నాపురంలో కార్యాచరణలో ఉండడం గర్వకారణం మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారతదేశం యొక్క హరిత శక్తి సామర్థ్యానికి ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ’’ అని అన్నారు. ఈ మార్గదర్శక ప్రయత్నాన్ని సాధ్యం చేసిన ప్రగతిశీల విధానాలకు ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మంత్రి ప్రశంసించారు.
ఈ ప్రాజెక్ట్ యొక్క సాంకేతిక అంశాలను వివరిస్తూ, గ్రీన్‌కో గ్రూప్ సీఈఓ మరియు ఎండీ అనిల్ చలమలశెట్టి మాట్లాడుతూ- సౌర, పవన మరియు పంప్ చేయబడిన నిల్వ శక్తిని కలిపే ఈ కొత్త చొరవ, కష్టతరమైన పరిశ్రమలను డీకార్బనైజ్ చేయడానికి ప్రపంచ ప్రయత్నాలకు కీలకమైన సహకారాన్ని అందిస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిని పెంచుతుందని, అనుబంధ పరిశ్రమల అభివృద్ధిని పెంపొందించి, ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్ట్ టా 3.3 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను నివారించడం ద్వారా స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తికి సహాయపడుతుంది. అలాగే, భారతదేశ ఇంధన భద్రతను పెంచుతుంది. గ్రీన్‌కో ఇంటెలిజెంట్ ఆర్ఈ క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్ఫామ్‌ని కలిగి ఉంది. ఇది భారతదేశపు ఒక దేశం, ఒక గ్రిడ్ పాలసీతో కలిపి, ప్రపంచంలోనే అతి తక్కువ ధర కలిగిన గ్రీన్ మాలిక్యూళ్ల ఉత్పత్తిని సులభతరం చేస్తుంది. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల డీకార్బనైజేషన్‌ను వేగవంతం చేస్తుంది.
అంతకుముందు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోసి ఈ సౌకర్యాన్ని ఏరియల్ టూర్ ద్వారా సందర్శించి, మెగా సమైక్య పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులోని వివిధ భాగాలను సందర్శించారు.
Prajavartha Online Telugu News