-రాయలసీమకే తలమానికమైన తిరుపతి పట్టణంలో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది: రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖా మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
-గ్రామస్థాయి నుండి క్రీడాకారులను ప్రోత్సహించాలి: జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎస్
-స్పోర్ట్స్ కోటాను రెండు నుంచి మూడు శాతంకు పెంచిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానిది : ఎం.ఎల్.ఏ ఆరణి శ్రీనివాసులు
-స్పోర్ట్స్ హబ్ గా తిరుపతి జిల్లాను తీర్చిదిద్డాలి : శ్యాప్ చైర్మన్ రవి నాయుడు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాయలసీమకే తలమానికమైన తిరుపతి పట్టణంలో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రెండు శాతం ఉన్న స్పోర్ట్స్ కోటానూ మూడు శాతం కోటాతో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా రిజర్వేషన్ తీసుకురావడం జరిగిందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖా మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎస్ తెలిపారు.
బుధవారం స్థానిక ఎస్.వి ఆర్ట్స్ కాలేజ్ లోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ తిరుపతి నందు పద్మ భూషణ్ మేజర్ ధ్యాన్ చంద్ హాకీ క్రీడాకారుడు వారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి యువజన క్రీడా శాఖా మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, తిరుపతి శాసన సభ్యులు ఆరని శ్రీనివాసులు, టి టి డి బోర్డ్ మెంబర్ పనబాక లక్ష్మీ, శ్యాప్ చైర్మన్ రవి నాయుడు, బి.సి యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్..
ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ… రాయలసీమకే తలమానికమైన తిరుపతి పట్టణంలో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. నారా లోకేష్ బాబు నాయకత్వంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సౌత్ ఇండియా లో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక సౌకర్యాలు గల ఇండోర్ స్టేడియం ను ప్రారంభించడం జరిగిందని ఈరోజు శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ నందు సి ఏస్ ఆర్ ఫండ్స్ తో పేద క్రీడా కారుల కోసం ఈ రోజు శ్రీనివాస స్పోర్ట్ ఆడిటోరియం నందు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందని అన్నారు. క్రీడాకారుల గౌరవం కోసం, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా..రాష్ట ప్రభుత్వం 3 శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది అని అన్నారు. ఓలిపింక్స్, ఏషియన్ గేమ్స్ పాల్గొనడానికి వెళ్లే విద్యార్థులకు మంచి ప్రోత్సాహాలు ఇవ్వడం, శిక్షణ కాలంలో ఖర్చులు, రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వo భరిస్తుందని తెలిపారు. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో విద్యార్థులు 81.5 శాతం ఉత్తీర్ణత సాధించడం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని తెలిపారు. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు అని అన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తిరుపతి జిల్లాలో అధునాతన స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశించి ఉన్నారు. తిరుపతి స్మార్ట్ సిటీ వారి ఆధ్వర్యంలో ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించడం జరిగిందని, జిమ్, వాలీబాల్, బాస్కెట్ బాల్ కోర్టు, షటిల్ కోర్ట్స్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ నందు సుమారు 800 మంది విద్యార్థులు, ఇతర వయసు గలవారు అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను ప్రతిరోజు ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నందు జిమ్, బాల్ బ్యాడ్మింటన్, సింథటిక్ టెన్నిస్ కోర్ట్, స్కేటింగ్, స్విమ్మింగ్ పూల్, వాటర్ ప్లాంట్ , మల్టీ పర్పస్ స్పోర్ట్స్ అరేనా, ఎన్ టి ఆర్ కే.వి.కే సెంటర్ ను ఈరోజున గౌ. క్రీడా శాఖ మంత్రివర్యులు ప్రారంభించడం జరిగిందని అన్నారు. మొట్ట మొదట ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన పికిల్ బాల్ గేమ్ ను కూడా శ్యాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా గవర్నమెంట్ మరియు శ్యాప్ ఆధ్వర్యంలో మొట్ట మొదటి సారిగా ఒక ఇండోర్ రైఫిల్ షూటింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నేడు గౌ. మంత్రి వర్యుల చేతుల మీదుగా రూ.6 కోట్లతో వివిధ రకాల స్పోర్ట్స్ సౌకర్యాలను ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. గొల్లవానిగుంటలో నిర్మాణ దశలో ఆగిపోయిన క్రికెట్ స్టేడియం ను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. మూడు శాతం కోటతో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా రిజర్వేషన్ తీసుకురావడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం క్రీడలకు సంబంధించి యువతకు మంచి అవకాశాలను కల్పిస్తోందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్రీడాకారులను తీసుకురాగల గొప్ప చరిత్ర ఉందని అది అలాగే కొనసాగేలా గ్రామస్థాయి నుండి క్రీడాకారులను ప్రోత్సహించాలన్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్పోర్ట్స్ కోటాను రెండు నుంచి మూడు శాతంకు పెంచిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానిదని ఆయన చెప్పారు. విద్యాకేంద్రమైన తిరుపతిని స్పోర్ట్స్ హబ్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దుతున్నారని ఆయన తెలిపారు. మల్టీపర్పస్ స్పోర్ట్స్ ఎరినాను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించడం సంతోషమన్నారు. స్మార్ట్ సిటీ నిధులతో క్రీడాకారులకు మౌళిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీఠ వేస్తోందని ఆయన చెప్పారు. దామినేడు వద్ద 38 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీని ప్రభుత్వం నిర్మిస్తుందని ఆయన తెలిపారు.
శ్యాప్ప్ చైర్మన్ మాట్లాడుతూ.. తిరుపతిని స్పోర్ట్స్ హబ్ గా ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని తెలిపారు. రాష్ట్రంలో క్రీడలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ప్రోత్సహిస్తున్నారని ఆయన తెలిపారు. క్రీడా పాలసీని దేశంలో తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి రెండు శాతం రిజర్వేషన్ క్రీడాకారులకు కల్పించినట్లు ఆయన చెప్పారు. 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే రెండుశాతం స్పోర్ట్స్ కోటాను మూడు శాతంకు పెంచి ఇటీవల జిఓ కూడా విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఆయన తెలిపారు. రిజర్వేషన్ కల్పించడంతోపాటు క్రీడాకారులకు ప్రోత్సాహాలను భారీగా పెంచారని ఆయన వివరించారు. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను టిటిడి, శ్యాప్ నిధులతో ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దాన్ని విస్తరించిన ఘనతా ఆయనకే దక్కుతుందన్నారు. వెయ్యిమందికి ఈ కాంప్లెక్స్ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. గొల్లవానిగుంట క్రికెట్ స్టేడియం త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో టి.టి.డి బోర్డ్ మెంబర్ పనబాక లక్ష్మి, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రో.ఉమ, మాజీ ఎం.ఎం.ఏ సుగుణమ్మ , డిప్యూటి మేయర్ లు ముద్ర నారాయణ, మునికృష్ణ, డి.ఎస్.డి.ఓ సయ్యద్ సాహెబ్ , ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News