Breaking News

రుయా హాస్పిటల్ కు వచ్చు రోగులు మరియు రోగుల సహాయకులు సౌకర్యార్థం చలువ పందిళ్లు ఏర్పాటు

-హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్  ఆదేశాల మేరకు రుయా హాస్పిటల్ కు వచ్చు రోగులు మరియు రోగుల సహాయకులు సౌకర్యార్థం చలువ పందిళ్లు ఏర్పాటు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ వేంకటేశ్వర రామ్ నారాయణ్ రుయా ప్రభుత్వ సర్వ జన వైద్యశాలలో రోగుల మరియు వారి సహాయకులకు వేసవి కాలములో ఎండకు ఉపశమనార్ధం హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ మరియు తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ గారి ఆదేశాల మేరకు హాస్పిటల్ అధికారులు, APMSIDC అధికారులతో కలిసి హాస్పిటల్ నందు 8.5 లక్షల ఖర్చుతో చలువ పందిళ్ళు ఏర్పాటు చేయించడం జరిగింది. ఇవి ప్రత్యేకంగా క్యాజువాలిటీ, ఓపీ విభాగము, CT Scan, MRI Scan, X ray, అల్ట్రాసౌండ్ మరియు రక్త పరీక్షలకు వెళ్ళే రోగులకు, సహాయకులకు ఉపశమనం కలిగించుచున్నవి. ఈ చలువ పందిళ్ళు 3 నెలల పాటు రోగుల సౌకర్యార్ధము ఉంచబడుతుంది. హాస్పిటల్ అధికారులు, ఈ విషయమై గౌరవనీయులైన (HDS) హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ మరియు కలెక్టర్ గారికి, అట్లే HDS కో చైర్మన్ మరియు తిరుపతి శాసన సభ్యులు,  ఆరణి శ్రీనివాసులు కి అభినందనలు తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *