-ఆర్ వో సమావేశం నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నీటి తీరువా పన్నుల వసూళ్ల లో ఇరిగేషన్ కాలువ కింద ఒక పంట, రెండు పంటల సాగు విస్తీర్ణం అనుసరించి ఉండాలని, గతంలో నిర్ధారణ చేసిన విస్తీర్ణం అనుసరించి లక్ష్యాలు నిర్ధారించడం జరిగిందని, వాటికి కట్టుబడి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు.
గురువారం ఉదయం క్షేత్ర స్థాయి రెవెన్యూ అధికారులు సమావేశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు , డి ఆర్వో టి సీతారామ మూర్తి లతో కలిసి కలెక్టరు రెవెన్యూ అంశాలు , పీజీఆర్ఎస్ , రీ సర్వే లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, మండల వారీగా వాటర్ యూజర్స్ అసోసియేషన్ వివరాలు ప్రచురించాలన్నారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయిలో నీటి తీరువా పన్నుల వసూళ్ల పై వ్యక్తిగత పర్యవేక్షణ చెయ్యడం జరుగుతున్నట్లు తెలిపారు. నీటి తీరువా పన్నుల వసూళ్ల పై వ్యక్తిగత పర్యవేక్షణ చెయ్యడం తప్పనిసరి అని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో 2,80,000 ఎకరాల ఆయకట్టు పరిధిలో సాగు విస్తీర్ణం ఉన్నట్లు వాటికి సంబంధించి రూ.2,84,51,378 మేర పన్నులు వసూలు చెయ్యాల్సి ఉందన్నారు. వాటిలో రూ . 2,00,11,361 (42.16%) మాత్రమే లక్ష్యాలను సాధించడం జరిగిందన్నారు. రాజమండ్రి డివిజన్ 40.57 %, , కొవ్వూరు డివిజన్ 43.75% మేర లక్షలు సాధించినట్లు తెలిపారు. మార్గదర్శకాల మేరకు జనవరి నెలాఖరారు నాటికి లక్ష్యాలను సాధించాల్సి ఉందన్నారు. ఆయకట్టు పరిధిలో సాగు విస్తీర్ణం నిర్ధారణ హెచ్చు తగ్గులను రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ శాఖలు ఆధ్వర్యంలో నిర్ధారణ చేయాలన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వస్తున్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సగటున పిజిఆర్ఎస్ కు వొస్తున్న తొలి అయిదు అంశాలలో భూముల కొలతల్లో వత్యాసాలు (తేడాలు) , ఎల్ పి ఎమ్ కు చెందిన విభజన కోసం అర్జీలు , దిద్దుబాట్లు , మ్యుటేషన్, సరిహద్దు కొలతలు కు చెందినవి రావడం జరుగుతోందని పేర్కొన్నారు. రీ ఓపెన్ అవుతున్న వాటిలో కొలతల్లో వత్యాసాలు (తేడాలు) , మ్యుటేషన్ , ఆర్ వో ఆర్ దిద్దుబాట్లు , పౌర సేవలు వొస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి నెలా నిర్వహిస్తున్న రివ్యూ రెవిన్యూ అధికారుల సమావేశం వచ్చామా వెళ్ళామా అనే రీతిలో కాకుండా ఫల వంతమైన దిశలో నిర్వహించాల్సింది ఉందన్నారు. గత సమావేశంలో తీసుకున్న సూచనలను సలహాలను తదుపరి సమావేశానికి చేరుకోవాలని స్పష్టం చేశారు
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతా రామమూర్తి ఆర్డీవోలు ఆర్ కృష్ణ నాయక్ , రాణి సుస్మిత , హౌసింగ్ పిడి ఎస్ భాస్కర్ రెడ్డి, జిల్లా సర్వే అధికారి బి లక్ష్మీనారాయణ, కలెక్టరేట్ ఏవో ఆలీ, , 19 మండలాల తాసిల్దార్లు , కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు,
Prajavartha Online Telugu News