Breaking News

చంద్రబాబు రాజకీయ లబ్ది కోసమే ఎస్సీ వర్గీకరణ…. : ఉప్పులేటి దేవి ప్రసాద్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ అశాస్త్రీయంగా ఉందని కేవలం రాజకీయ మైలేజ్ కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వర్గీకరణను వాడుకున్నాడని, వర్గీకరణ ద్వారా ఎస్సీలు అందరూ కూడా నష్టపోతున్నారని,మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్ అన్నారు. మాల సంఘాల జేఏసీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పులేటి దేవి ప్రసాద్ మాట్లాడుతూ దేవిందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్’ కేసులో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలోని మెజార్టీ సభ్యులు క్రీమీలేయర్ ఉండాలని తీర్పుల్లో పేర్కొన్నారు. ఆ కేసులో తీర్పు ఆధారంగానే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిషన్ కూడా ఎస్సీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ ఉండాలని సిఫార్సు చేసిందని.. కానీ ఈ అంశాన్ని పక్కన ఎట్టి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమల్లోకి తేవడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు..ముఖ్యంగా మాలలకు అన్యాయం జరిగిందని చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ జీవితాన్ని తూర్పారబట్టారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ గుర్రం రామారావు, మాజీ డీఎస్పీ రవికుమార్, గుంటూరు నగర అధ్యక్షులు నల్లపు నీలాంబరం, బోరగా రత్నం, విప్పర్ల విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *