Breaking News

డాక్టర్ల కెరీర్‌ను బలపరచి తీర్చిదిద్దటానికి ‘ఐఎస్‌ఎమ్‌’ ఒక వేదిక…

-విదేశాలలో ఎమ్‌బిబిఎస్‌ కలలను సాకారం ఐఎస్‌ఎమ్‌ ఫోకల్‌ పాయింట్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డాక్టర్ల కెరీర్‌ను బలపరచి ఉన్నతమైన స్థానంలో తీర్చిదిద్దే విధంగా ముందుకు తీసుకెళ్లడానికి ‘ఐఎస్‌ఎమ్‌’ వేదికగా దోహదపడుతుందని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముంజేటి రామారావు స్పష్టంచేశారు. గురువారం, మొఘల్‌రాజ్‌పురంలోని అమ్మా కళ్యాణమండపం సమీపంలో నూతన ఇంటర్నేషనల్‌ హయ్యర్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ (ఐఎస్‌ఎమ్‌) నూతన బ్రాంచ్‌ని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో 10 వరకు కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. విదేశాలలో ఎమ్‌బిబిఎస్‌ కోసం ఇంటర్నేషనల్‌ హయ్యర్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ కాలేజ్‌లో చేరి వారి కలలను సాకారం చేసుకోవాలన్నారు. మెడిసిన్‌ చేయడానికి, ఎఫ్‌ఎంజి ఎగ్జామ్‌ సులభతరం చేయటానికి ‘ఐఎస్‌ఎమ్‌ ఫోకల్‌ పాయింట్‌’ ఎంతో దోహదపడుతుందన్నారు. ఇంటర్నేషనల్‌ హయ్యర్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ కాలేజ్‌ అనేది నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసి) గుర్తింపు పొందిన సంస్థగా పేర్కొన్నారు. విజయవాడ నూతన బ్రాంచ్‌ మేనేజర్లు నాగిశెట్టి జ్యోతి, నాగిశెట్టి పవన్‌కుమార్‌లు మాట్లాడుతూ తల్లిలాంటి శిక్షణ… తండ్రి లాంటి రక్షణ నినాదంతో ముందుకు వెళుతున్నామన్నారు. కిర్గిస్తాన్‌లో ఐఎస్‌ఎమ్‌ ద్వారా వెళ్ళి ప్రతి విద్యార్థికి ఆహారం, చదువు, సదుపాయాలు, నిష్ణాతులైన ప్రొఫెసర్లతో మంచి చదువు చెప్పి తీర్చిదిద్దటమే కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో వుండటానికి, చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పించి ఐదున్నర సంవత్సరాలకు డిగ్రీ సాధించి వచ్చే విధంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులైన సుమారు 13,400లో 1,075 మంది విద్యార్దులు ఇక్కడ నుండి వెళ్ళినవారేనని తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో ఎమ్‌బిబిఎస్‌ పూర్తి చేసే అవకాశం మా సంస్థ ద్వారా కలుగుతుందని తెలిపారు.
జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి నిర్వాహకులకు అభినందనలు తెలిపి మరిన్ని బ్రాంచిలు స్థాపించి దినదినాభివృద్ధి చెందాలని అభిలషిస్తున్నట్లు తెలిపారు. ఎమ్‌బిబిఎస్‌ చదువుకోవాలనుకునే విద్యార్దులకు ఇది మార్గదర్శకంగా వుంటుందని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
అనంతరం నాగిశెట్టి వర్షిత, దుంపాటి ప్రశాంతిలు నిర్వహించే శాంతిస్‌ క్రియేటివ్‌ వరల్డ్‌ను కూడా సందర్శించి నేటి తరం యువతిలు, మహిళలకు అందరిని తమ అందాలకు మెరుగుదిద్దే విధంగా అన్ని సౌకర్యాలు ఒక్కచోట ఏర్పాటుచేసిన నిర్వాహకులను ముఖ్య అతిధులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, భారీ సంఖ్యలో కస్టమర్లు, సిబ్బంది, కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *