విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన చేసి సంతాపం దుర్గాపురం వాకర్స్ అసోసియేషన్ క్లబ్ సభ్యులు తెలియజేశారు. ఈరోజు విజయవాడ దుర్గాపురం వాకర్స్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గాపురం వాకింగ్ ట్రాక్ అసోసియేషన్ నందు అధ్యక్షులు ఎస్కే బాబు అధ్యక్షతన పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన ద్వారా సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని దుర్గాపురం వాకర్స్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో దుర్గాపురం వాకర్స్ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.కె. బాబు మాట్లాడుతూ దేశంలో ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి దుస్థితిని చూసి ఉగ్రవాదుల నీచాతి నీచమైన హేయమైన చర్యలను నరరూప రాక్షసులుగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది వి.గురునాథం వెంకట కృష్ణారావు, సత్యనారాయణ, వంశీ, పైడ్రాజు, మురళి, ఆంజనేయులు, సాంబశివరావు, వెంకటేశ్వరరావు, వెంకట్రావు, కోటేశ్వరరావు, వలి, హేమేశ్వరరావు, రామకృష్ణ, బాబురావు, రాము, విజయలక్ష్మి తదితర మహిళా వాకర్స్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News