-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యాధరపురం ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చెయ్యాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా విద్యాధరపురం స్టేడియం, నైజాంగేట్ ఔటఫాల్ డ్రైన్, ఆర్టీసీ వర్కుషాప్ రోడ్డు, లేబర్ కాలనీ, ఔటఫాల్ డ్రైన్, విద్యాధరపురం అన్న క్యాంటీన్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విద్యాధరపురం లోని నిర్మాణం దశలో ఉన్న ఇండోర్ స్టేడియం త్వరితగతిన పూర్తి చేసి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. నైజాం గేట్ ఔటఫాల్ డ్రైన్, ఆర్టీసీ వర్కుషాప్ రోడ్డు లో నూతనంగా నిర్మిస్తున్న ఔటఫాల్ డ్రైన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించి జరుగుతున్న డీసిల్టింగ్ పనులు పూర్తి చేయాలని, ఇంజనీరింగ్ సిబ్బంది, ప్రజారోగ్యం సిబ్బంది సమన్వయంతో ఫ్లోటింగ్ గార్బేజ్, సిల్ట్ లను ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుస్తూ డ్రైన్ ప్రవాహంలో ఎటువంటి అవాంతరం లేకుండా చూసుకోవాలని అన్నారు.
తదుపరి విద్యాధరపురం లోగల అన్నా క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీటి సౌకర్యంలో అంతరాయం లేకుండా చూసుకోవాలని అన్నారు. అన్న క్యాంటీన్ కి వచ్చే ప్రజలకు క్యూఆర్ కోడ్ ద్వారా అన్న క్యాంటీన్ లో గల వసతులపై వారి అభిప్రాయాన్ని ఎలా తెలియపరచచ్చు అక్కడున్నవారికి తెలియపరిచారు. నగర పరిధిలో గల అన్న క్యాంటీన్లో ఎటువంటి మరమ్మతులు ఉన్న వెంటనే చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, అన్నపూర్ణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేఖ, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News