అర్జీలను సత్వర పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార విధానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్ర స్థాయి అధికారులు ద్వారా సిఫార్సు చేసిన అర్జీలను సత్వర పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు

శనివారం కలెక్టరేట్, కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా జిల్లా, డివిజన్ మండల స్థాయి అధికారులు వద్ద పెండింగ్ కేసులను ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లా పరిధిలో మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, తదితరులు నుంచి మొత్తం 91 అర్జీలు సిఫార్సు చేసినట్లు, వాటిలో ఇంకా 57 కేసుల పరిష్కార స్థాయి పెండింగ్ విషయమై అధికారులు నుంచి వివరణ కోరడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా 27, డిప్యూటీ సీఎం ద్వారా 22, ఇతరుల ద్వారా 42 పరిష్కారం కోసం వొచ్చినట్లు, వాటికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి పరిష్కారం చూపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఏ ఒక్క దరఖాస్తు సరైన కారణాలు లేకుండా పరిష్కారం అయినట్లు ఎండార్స్ మెంట్ చెయ్యరదన్నారు. ఇందులో భాగంగానే ఆయా ఫైల్స్ తీసుకుని సంబంధిత అర్జీలను జిల్లా కలెక్టర్ వ్యక్తిగతంగా పరిశీలించి, తగిన సూచనలను చెయ్యడం జరిగింది.

జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, ఆర్డీవో రాణి సుస్మిత, ఆర్ కృష్ణ నాయక్, సంబంధించిన మండలాల తహసిల్దార్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *