Breaking News

రసాయనాయలతో పండ్లను మాగ బెట్టి విక్రయిస్తే వ్యాపారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం

-జిల్లా జాయింట్ కలెక్టర్, ఎస్. చిన్న రాముడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రసాయనాయలతో పండ్లను మాగ బెట్టి విక్రయిస్తే అటువంటి వారిపై, వ్యాపారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్, ఎస్. చిన్న రాముడు హెచ్చరించారు. స్థానిక మార్కెట్ యార్డ్ సమీపంలో రైతులు, వినియోగదారులు, వ్యాపారస్తులతో కృత్రిమంగా పండ్లను మాగ బెట్టడం ఆరోగ్యానికి హానికరమనే అంశంపై శనివారం ఉదయం అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ సహజ సిద్ధంగా పండ్లను మాగ పెడితే ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి హాని కలుగదని పేర్కొన్నారు. ఆ కోణంలో వ్యాపారస్తులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
కృత్రిమంగా పండ్లను మాగ బె ట్టడం ఆరోగ్యా నికి హానికరమని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు సహజంగా పండిన పండ్లను ఎంచుకోవాలని, రసాయనాలతో మాగ బెట్టిన పండ్ల ను తినడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవా ల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మామిడి పండ్లను కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలతో కృత్రిమంగా మాగబెట్టడం చాలా సాధారణమని ఈ పద్ధతి వల్ల పండ్లలో హానికరమైన రసాయనాలు చేరి, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర మైన ప్రభావం చూపిస్తున్నా యన్నారు. కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలతో మాగ బెట్టిన పండ్లను తింటే, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధు లు, జీర్ణవ్యధులు, మరి యు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలని తెలిపారు. పండ్లు మాగ పెట్టిన వ్యాపారస్తులపై ఆరు నెలలు జైలు, 5 లక్షల రూపాయలు వరకు జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. అటువంటి వాటిని గుర్తిస్తే అధికారులకి ఫిర్యాదు చెయ్యాలని జేసి కోరారు.

ఈ సందర్భంగా జిల్లా ఆహార భద్రత అధికారి వి. రుక్కయ్య మాట్లాడుతూ వ్యాపారస్తులు నిషేధిత కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలతో కృత్రిమంగా పళ్ళను మాగ బెట్టితే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రసాయనాలతో వ్యాపారస్తులు పండ్లను మాగ పెడితే వారి లైసెన్సు లు పూర్తిగా రద్దు చేస్తామన్నారు.
మామిడి పండ్లు, ఇతర పండ్లు కృత్రిమంగా మాగబెట్టే పద్ధతులు ప్రజల ఆరోగ్యానికి చాలా హానికరమన్నారు. కావున ఎథలిన్ గ్యాస్ ఛాంబర్లు, రైఫిన్ ప్యాకెట్లు, గడ్డిలో గాని, ద్వారానే పళ్ళు మాగ పెట్టాలని తెలిపారు. ఈ విధంగా పండ్లను మాగపెడితే ప్రజ ల ఆరోగ్యాలను కాపాడడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఏడి మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. సునీల్ వినయ్, జిల్లా ఆహార భద్రత అధికారి వి. రుక్కయ్య, జిల్లా ఉద్యాన శాఖ అధికారి బి. సుజాత కుమారి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సీహెచ్ సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *