Breaking News

డి.డి.యు.జి.కె.వై ప‌థ‌కం కింద నిరుద్యోగుల‌కు ఉద్యోగం వ‌చ్చే విధంగా ఉచితంగా శిక్ష‌ణ ఇస్తాము : జె.డి.ఎమ్ సుమలత

-షేర్ మహమ్మద్ పేట లో విలేజ్ ఛాంపియ‌న్స్ ఆధ్వ‌ర్యంలో గ్రామ స‌భ‌
-సిడాప్ ద్వారా ఉచితంగా అందించే ఉద్యోగ శిక్ష‌ణ అవ‌కాశాల‌పై అవ‌గాహ‌న‌
-యువతీ యువ‌కుల‌కి అవ‌గాహ‌న క‌ల్పించిన జె.డి.ఎమ్., పుడ్ ప్రొసెసింగ్ డి.ఆర్.ఎమ్

జ‌గ్గ‌య్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామాల పరిపూర్ణ వికాసం చెందాలంటే పూర్తిస్థాయి ఉద్యోగ, ఉపాధి క‌ల్ప‌న గ్రామాలలో ఉండాలి. ఇందుకోసం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ప‌థ‌కం ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో సీడాప్ ద్వారా 18 నుంచి 35 సంవత్స‌రాలోపు గ‌ల గ్రామీణ నిరుద్యోగ యువ‌తీ యువ‌కుల‌కు నైపుణ్య శిక్ష‌ణ‌, ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించ‌టం జ‌రుగుతుంద‌ని జె.డి.ఎమ్ (జాబ్స్ డిస్ట్రిక్ మేనేజర్) సుమలత చెప్పారు.

ఎంపి కేశినేని శివ‌నాథ్ స‌హ‌కారంతో కేశినేని ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ ఎన్ఐఆర్ డి పి ఆర్ లో స‌మ‌గ్ర‌గ్రామీణాభివృద్ది పై శిక్షణ పొందిన విలేజ్ ఛాంపియన్స్, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి ప్రోగ్రామ్ కో-ఆర్డినేట‌ర్ NIRD జి.వి.న‌ర‌సింహారావు ఆద్వ‌ర్యంలో ఆదివారం జ‌గ్గ‌య్య‌పేట రూర‌ల్ మండ‌లంలోని షేర్ మహమ్మద్ పేట గ్రామంలో గ్రామ స‌భ జరిగింది.

ఈ స‌భ లో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన గురించి, స్వయం సహాయ సంఘాలకు స్వయం ఉపాధి రంగాలలో ఉన్న అవకాశాలు, ప్ర‌భుత్వం అందించే రుణాల గురించి జె.డి.ఎమ్ (జాబ్స్ డిస్ట్రిక్ మేనేజర్) సుమలత తోపాటు ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి ప్రోగ్రామ్ కో-ఆర్డినేట‌ర్ NIRD జి.వి.న‌ర‌సింహారావు వివ‌రించారు.

ఈ సభ‌లో జె.డి.ఎమ్ సుమ‌ల‌త మాట్లాడుతూ గ్రామాలలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారని వారికి ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలు వినియోగించుకోవాల‌న్నారు. డి.డి.యు.జి.కె.వై (దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన) ప‌థ‌కం ద్వారా నిరుద్యోగుల‌కి వారి అర్హ‌త‌కి సంబంధించిన నైపుణ్య‌, క‌మ్యూనికేష‌న్ స్కిల్ పెంపొందించే విధంగా ఉచితంగా శిక్ష‌ణ అందిస్తామన్నారు. . వీరికి శిక్షణ 90 నుంచి 100 రోజులు ఉంటుందని, శిక్ష‌ణ పొందే వారికి భోజన సౌకర్యాలు, హాస్టల్ వసతి అన్ని సౌకర్యాలు ఉచితంగా ఉంటాయని చెప్పారు. సిడాప్ ద్వారా బిఎస్సీ నర్సింగ్ చదివిన యువతీయువకులకు ట్రైనింగ్ ఇచ్చి జర్మన్ పంపిస్తున్నట్లు తెలిపారు. జర్మన్ భాష పై కూడా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
జగ్గయ్యపేట పట్టణంలోని కోదాడ రోడ్ లోని విజ్ఞాన్ స్కూల్ వద్ద దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్ ను సందర్శిస్తే మ‌రింత అవ‌గాహ‌న క‌లుగుతుంద‌న్నారు.

అలాగే ఉపాధి రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు గురించి ఫుడ్ ప్రాసెసింగ్ డి.పి.ఆర్ సురేష్ వివ‌రించారు.. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రుణాలు , సబ్సిడీ గురించి చెప్పారు. ఈ రుణాల ఏ విధంగా పొందాలో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వివ‌రించారు.

అనంత‌రం ఎన్.ఐ.ఆర్.డి ఎన్.టి.ఆర్ జిల్లా ప్రోగ్రామ్ కో ఆర్డినేట‌ర్ జి.వి.న‌ర‌సింహారావు మాట్లాడుతూ వికసిత్ పంచాయతీలో భాగంగా గ్రామాలు పూర్తిస్థాయి అభివృద్ధి చెందాలనేది ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఉద్దేశ్యమ‌న్నారు. గ్రామీణ ప్రాంతంలోని యువతీయువ‌కులు నిరుద్యోగంతో భాద‌ప‌డుకుండా వుండేందుకు జిల్లా అధికారుల‌తో మాట్లాడి ఉద్యోగ కల్పన, ఉపాధి రంగాల్లో అవ‌కాశాల‌పై ఈ గ్రామ స‌భ ఎంపి కేశినేని శివ‌నాథ్ ఏర్పాటు చేయించ‌టం జ‌రిగింద‌న్నారు. జిల్లా అధికారులు చెప్పిన విధంగా ఉచితంగా శిక్ష‌ణ పొంది ఉద్యోగాలు సంపాదించాల‌ని ఆకాంక్షించారు.

ఈ కార్య‌క్ర‌మంలో స్కిల్ అప్ కోఆర్డినేటర్ రామ తులసి , వెలుగు ఏపీఎం వెంకటేశ్వర రావు, మండల సమైక్య అధ్యక్షులు గద్దె రాజలక్ష్మి , సిడాప్ జాబ్ కోఆర్డినేట‌ర్స్ అశోక్ ,చందు, జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గ‌ సిడాప్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ చార్జ్ ర‌మేష్ ల‌తో పాటు ,డ్వాక్రా సంఘాల మహిళలు , గ్రామ ప్ర‌జ‌లు, యువ‌తీయువ‌కులు, పంచాయతీ ఛాంపియన్స్ పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *