Breaking News

“వేసవి విజ్ఞాన తరగతులు”

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పౌర గ్రంథాలయ శాఖ సంచాలకుల వారి ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడును “వేసవి విజ్ఞాన తరగతులు” బ్రోచరు ను ఏ. భార్గవ్ తేజ, I.A.S., జాయింట్ కలెక్టరు మరియు పర్సన్ ఇంచార్జి, ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ వారు ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 98 శాఖా గ్రంథాలయాల్లో ది:28/04/2025 నుండి 06/06/2025 వరకు 40 రోజు లు పాటు వేసవి విజ్ఞాన తరగతులు నిర్వహించబడును.ఈ వేసవి విజ్ఞాన తరగతులు ఉదయం :8:00 గంటలకు నుండి 11:00 గంటల వరకు నిర్వహించబడును. కావున తల్లిదండ్రులు తమ పిల్లలను పంపి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ గ్రంథాలయాల నందు కధలు చదివి వినిపించడం, పుస్తకాలు చదవడం, పుస్తక సమీక్షలు, కధలు చెప్పడం, స్పోకెన్ ఇంగ్లీష్/డ్రాయింగ్/పెయింటింగ్/పేపర్ క్రాఫ్ట్స్/డ్యాన్స్/పప్పెట్ మేకింగ్/చెస్/క్యారమ్స్/Qize/జికె మరియు ఇతర అంశాలు నేర్పబడును అని తెలియజేశారు. తల్లిదండ్రులు పిల్లలను గ్రంథాలయాల వైపు నడిపించి ప్రోత్సహించవలెను అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ, ఉపగ్రంధపాలకురాలు కె.ఝాన్సీ లక్ష్మి,లైబ్రేరియన్ యన్.నాగిరెడ్డి, విజయ్ కుమార్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *