Breaking News

వేసవి తాపాన్ని తగ్గించేందుకు ప్రజల దాహార్తిని తీర్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు

-MLA బొండా ఉమ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ సింగ్ నగర్ వడ్డెర కాలనీ మెయిన్ రోడ్డు  వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించి పాదచారులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగినది.

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ వేసవిలో పాదచారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ వేసవికాలంలో ప్రజలకు ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ప్రభుత్వం తరఫున అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, తప్పనిసరి అయితేనే తప్ప ప్రజలు మధ్యాహ్నం పూట ఎలా నుండి బయటకు రావద్దని, వచ్చిన తగు జాగ్రత్తలు తీసుకొవాలి అని, నియోజకవర్గంలోని పలు డివిజన్లో, జన సంచారం ఎక్కువగా ఉండే కూడలి సెంటర్లలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు వాహనదారులకు మజ్జిగ పంపిణీ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నారని, ఈరోజు ఈ ప్రాంతంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎండాకాలం వెళ్లే వరకు కూడా దీనిని కొనసాగిస్తారని నియోజకవర్గంలో ఇప్పటికే పలు ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేశామని, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ప్రజల శ్రేయస్సు కోరుతుంది అని, ఇలాంటి సేవా కార్యక్రమాలు నియోజకవర్గంలో మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, గుంజ గురుమూర్తి, ఒర్సు మస్తాన్, వేముల దుర్గారావు, ఓబుళ వెంకటేశ్వరరావు,సావిత్రి, డివిజన్ అధ్యక్షులు కూర్మాపు దుర్గారావు, సెక్రటరీ మల్లంపల్లి రవికుమార్, ఇన్చార్జి పిరియా సోమేశ్వరరావు,ఎరుబోతు రామారావు, దెందుకూరి మురళీ కృష్ణంరాజు, కాటుమల చంటి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *