Breaking News

పార్టీ అభివృద్ధి, బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

-MLA బొండా ఉమ
-కోటికి పైగా సభ్యత్వాలతో అసాధారణ రికార్డును సాధించాము

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
” సెంట్రల్ నియోజకవర్గం లోని 59వ డివిజన్ సింగ్ నగర్ షాదీ ఖానా నందు ఆదివారం 59 వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సభ్యుల ఆత్మీయ సమావేశం డివిజన్ అధ్యక్షులు రాజాన బంగారు నాయుడు, ఇంచార్జ్  Sk జాన్ వలి మరియు ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేయడం అయినది. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా:- ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు  సీనియర్ టిడిపి కార్యకర్తలను, నాయకులను బొండా ఉమ శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్బంగా బొండా ఉమ మాట్లాడుతూ:-మన తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారకరామారావు దివ్య ఆశీస్సులతో, సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే అందుకు కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగగుణం పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం తప్ప వేరే మాట వినిపించని గొంతుక ఉండే కార్యకర్తలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం అని, కార్యకర్తల క్షేమం, సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం, తెలుగుదేశం పార్టీ జండా మోసిన ప్రతీ కార్యకర్తను కుటుంబ సభ్యునిగా భావించి కార్యకర్త మరణిస్తే ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుని కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ పునాదికి మూల స్తంభాలు అని, గత ప్రభుత్వ అధికార అండ చూసుకుని ప్రజల్ని ఎన్నో ఇబ్బందులు పెడితే, నేడు ప్రజా ప్రభుత్వం – ప్రజల ప్రభుత్వం తమ దృష్టికి వచ్చిన ప్రతీ సమస్యను, ఇబ్బందిని పరిశీలించి వారికి తగిన పరిష్కారం దిశగా అడుగులు వేస్తు ప్రజలకు మంచి చేయటమే ఈ ప్రభుత్వ లక్ష్యం అని తెలుగుదేశం పార్టీ నాయకులు నిత్యం ప్రజలకు అనేక సేవలు చేస్తూ నియోజకవర్గంలో మంచి పేరును తెచ్చుకుంటున్నారని వారిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, NTR జిల్లా BC సెల్ అధ్యక్షులు మరక శ్రీనివాస్ యాదవ్, ఎలవర్తి శ్రీకాంత్, మద్దాల మహేష్, లూర్దు రాజు ,దుర్గారావు, మస్తాన్, SK గౌసియా, SD గౌసియా, నాగమణి, వెంకటేశ్వరరావు, వినయ్, హరమ్మ, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *