Breaking News

రాష్ట్ర ఖజానా శాఖ సర్వీసెస్ అసోసియేషన్ ఎన్నికలు నేడు…

-ప్రధమ కౌన్సిల్ సమావేశానికి హాజరుకానున్న రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఖజానా శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం స్థాపించిన ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ సర్వీసెస్ అసోసియేషన్ సంఘం రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు ఈనెల 28వ తేదీన నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాజ రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆర్థిక శాఖలో కీలక బాధ్యతలు వహిస్తూ, ప్రభుత్వ ఖజానాకు జవాబుదారీ తనంగా వ్యవహరిస్తున్న ఖజానా మరియు లెక్కల శాఖలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న పలు ఆర్థిక/ఆర్థికేతర సమస్యల పరిష్కారం, సి.యఫ్.యం.యస్. విధానంలో పటిష్ఠమైన ఆడిట్ విధానాన్ని మన శాఖలో అమలు చేయాలనే సంకల్పంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం పూట ఎన్నికలు నిర్వహణ, మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రధమ కౌన్సిల్ సమావేశం జరుగుతుందన్నారు. ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా విజయవాడ
డివిజినల్ కోపరేటివ్ అధికారి పి. కిరణ్ కుమార్, సహాయ ఎన్నికల అధికారిగా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం సూపరింటెండెంట్ ఎం. రవికుమార్, పరిశీలకులుగా ఒంగోలు డిప్యుటీ రిటైర్డ్ డైరెక్టర్ పి.హనుమంతరావు వ్యవహరిస్తారని తెలిపారు.

మధ్యాహ్నం 3గంటల నుండి ఎ.పి.టి.ఎ.ఎస్.ఎ. ప్రధమ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక, ప్రణాళికా శాఖ మరియు శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, విశిష్టఅతిధులుగా దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, విద్యుత్ శాఖమంత్రి గొట్టిపాటి రవికుమార్ లతోపాటు ట్రెజరీ శాఖ డైరెక్టర్ ఎన్. మోహన రావు,
విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ మోహనరావు, విజయవాడ మధ్య నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి తదితరులు హాజరవుతారని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *