Breaking News

గంజాయి విక్రేతలపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి

-నెల్లూరు జిల్లాలో పేట్రేగిపోతున్న అసాంఘిక శక్తులపై పోలీసులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
-అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిన సాయి ఎంక్లేవ్ అపార్ట్మెంట్
-హైకోర్టు అడ్వకేట్ పేటేటి రాజారావు మీడియా సమావేశంలో వెల్లడి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గంజాయి విక్రయిస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు అడ్వకేట్ పెటేటి రాజారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నేరచరిత్ర కలిగిన కొంతమంది గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్నారని వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజయవాడ ప్రెస్ క్లబ్ లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం పొడుగు పాడు గ్రామంలో సాయి ఎంక్లేవ్ అపార్ట్మెంట్లో గంజాయి అమ్మకాలు జోరూగా సాగుతున్నాయన్నారు. అపార్ట్మెంట్ను అడ్డగా చేసుకొని నిడగుంట అరుణ తన అనుచరులైన ఐ మునేంద్ర, రేఖ, నిడగుంట నరసింహులు, సత్యవేటి మునిస్వామి, సత్యవేటి శివకోటయ్య, చింతపురెడ్డి చంద్ర, చౌటూరి వెంకటరమణయ్యల సహకారంతో కొవ్వూరు మండలాన్ని అడ్డాగా చేసుకుని తన గంజాయి వ్యాపారాన్ని అసాంఘిక కార్యకలాపాలను ఎదేచ్చగా కొనసాగిస్తున్నారని తెలిపారు. కోవూరు మండలంలోని రేగుంటపాడు ఇనమడుగు చీరలపాలెం పలు కాలనీలు బోడిగుండ్ల తోట చుట్టూ ఉన్న ప్రాంతాలలో ఇడగుంట అరుణ గంజాయి సామ్రాజ్యాన్ని విస్తరింప చేసిందన్నారు. మరికొన్ని ప్రాంతాలలో పాత నేరస్తులు అండతో గంజాయి వ్యాపారం, అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు అన్నారు. అక్రమంగా డబ్బు సంపాదించిన లక్ష్యంతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇడుగుంట అరుణ పై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. పొడుగు పాడు గ్రామంలోని సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ సీసీ కెమెరాలను పరిశీలించాలని, ప్రతిరోజు నెంబర్ ఫీట్లు లేని బైకులు కార్లు నిరంతరం ఈ అపార్ట్మెంట్లోకి వస్తున్నాయని వాటిని పరిశీలిస్తే వారు చేసే అసాంఘిక కార్యపు గలపాలు బయటపడతాయని తెలిపారు. గంజాయిని విక్రయిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇడుగుంట అరుణ, ఆమె అనుచరులపై నెల్లూరు పోలీసులు తగిన చర్యలు తీసుకొని ప్రజలను కాపాడాలని కోరారు. ఈ సమావేశంలో షేక్ మస్తానయ్య ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *