Breaking News

ప్రతి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం అందించాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించడం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించడంతో పాటు, వాటికి శాశ్వత పరిష్కారం కనుగొనడంపై అధికారులకు సూచనలు ఇచ్చారు.

ఈ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 17 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 4, ఇంజనీరింగ్ 3 , రెవెన్యూ సంబంధించినవి 2, వైద్య & ఆరోగ్యం 2, ఉద్యానవనం 1, ఎస్టేట్ 1, పిఒ యుసిడి సంబంధించినవి 3, హౌసింగ్ సంబందించినవి 1 మొత్తం కలిపి 17 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు.

ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ప్రాజెక్ట్. డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు పి.సత్యనారాయణ, పి సత్యకుమారి, ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ కృష్ణ నాయక్, రీజినల్ ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *