-ఏప్రిల్ నెలకు సంబంధించిన 2,61,230 మంది ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత ఫించన్ దారులకు సూమారు 111.84 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు మే నెల, 2025 ఒకటవ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీ కి సర్వం సిద్ధం జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏప్రిల్ నెలకు సంబంధించిన 2,61,230 మంది ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత ఫించన్ దారులకు సూమారు 111.84 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు మే నెల, 2025 ఒకటవ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీ కి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు మే 1 వ తారీఖున పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 6.30 గంటల నుంచి లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ చేయాలని సచివాలయం సిబ్బందిని ఆదేశిస్తూ డిఎల్డిఓలను, ఎంపీడీవోలను, మున్సిపల్ కమిషనర్లను పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అధికారులకు టెలికాన్ఫరెన్స్, వర్చువల్ విధానంలో మంగళవారం సూచిస్తూ మే 1 వ తారీఖున గురువారం పంపిణీ చేయవలసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ మొత్తాన్ని ఈ నెల ఏప్రిల్ 30 బుధవారం నాడే సంబంధిత అధికారులు డ్రా చేసి సేఫ్ కస్టడీ లో ఉంచుకొని, మే 1 వ తారీఖున సిబ్బంది అందరూ ఉదయం 6.30 గంటల నుంచి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేయుట కొరకు వారి పంపిణి ప్రదేశాలకి చేరుకొని ఉదయం 6.30 గం లకు యాప్ ఓపెన్ అయ్యాక పింఛను దారులకు పింఛన్లు పంపిణి చేపట్టాలని సూచించారు.
మే 1 వ తేదీన ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పంపిణీ పింఛనుదారు ఇంటి నుండి ఖచ్చితంగా 300 మీటర్ల పరిది దాటితే పని చేయదని, పింఛనుదారుల ఇంటివద్దనే పింఛను ఇవ్వాలని, ఏ కారణం చేతనైనా ఇంటివద్ద ఇవ్వడం కుదరకపోతే తగిన కారణాలను యాప్ నందు నమోదు చేయవలయునని తెలియచేసారు. పింఛను దారులకు ముందుగా నమస్కారం పెట్టి గౌరవంగా చిరునవ్వు తో పింఛను పంపిణీ చేయవలయునని ఆదేశించారు. ఏ కారణం చేతనైనా పింఛను తీసుకోని లబ్ధిదారులకు వారి యొక్క చరవాణి కి సందేశం పంపబడుతుంది. వీరికి 02.05.2025 తేదీ మధ్యాహ్నం 02.00 గం.ల నుండి 05.00 గం.ల వరకు గ్రామ/వార్డు సచివాలయంలో సంబంధిత PS/WEA, WWDS/WAS వీరికి పించను మొతాన్ని తప్పనిసరిగా పంపిణి చేయవలెను. జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించిన 2,61,230 మంది ఫించన్ దారులకు సుమారు 111.84 కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నామని, గురువారం అదే రోజు 100 శాతం ఫించన్ల పంపిణీ చేయాలని, దానికి అనుగుణంగా ఎంపీడీఓ మరియు మునిసిపల్ కమీషనర్లు పింఛను పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. మే నెల 1 వ తేదీన పెన్షన్ ఇస్తున్న విషయం ప్రతి ఫించన్ దారునికి వ్యక్తిగతంగా తెలియచేయాలని, అలాగే ఫించన్ పంపిణీకి నిర్దేశించిన సిబ్బంది ఉదయం వారి పంపిణీ ప్రదేశానికి ఉదయం 6.30 గం.ల లోగా చేరుకుని తప్పకుండా ఆరోజు ఉదయం 7.00 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలన్నారు. ఎక్కడ కూడా ఏ ఒక్క పొరపాటు జరగకుండా ఫించన్లు పంపిణీ జరగాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పెన్షన్ పంపిణి చేయు అధికారి పెన్షన్ దారులతో గౌరవ ప్రదంగా వ్యవహరించాలని, అవినీతికి పాల్పడరాదని మరియు ఇంటి వద్దనే ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేయవలెనని తెలియజేశారు. ఎవరైనా దీనిని అతిక్రమించినచో క్రమశిక్షణా చర్యలు తీసుకోబడునని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. అలాగే గత నెలలలో ఏదేని కారణంతో ఫించన్ తీసుకోని వారికి ఈ నెల పించన్ మొత్తంతో కలిపి పంపిణీ చేయాలని అన్నారు. కావున ఈ సమాచారం అందరికి తెలియచేయాలని మండల పరిషత్ అభివృద్ది అధికారులను, మునిసిపల్ కమిషనర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఫించన్ దారులకు అందరికీ IVRS విధానం పై వ్యక్తిగతంగా తెలియచేయాలని అన్నారు.
మరియు వితంతు పించన్లకు(spouse )సంబంధించిన జాబితాలో అర్హులవి ఎవరిదైనా తమ పేరు రానిచో సంబందిత మండల/మునిసిపల్ కార్యాలయాల్లో తగిన ద్రువపత్రాలు సమర్పించవలెను. వీటిని ద్రువీకరించి ఎంపిడిఓ / మునిసిపల్ కమిషనర్ లేఖ ద్వారా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు పంపిన యెడల సెర్ప్ కార్యాలయానికి పంపడం జరుగుతుందని తిరుపతి జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News