Breaking News

జిల్లాలోని ప్రజలు సభకు వెళ్ళుటకు ఏర్పాట్లు జాగ్రత్తగా చేపట్టండి

-జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల మే 2 న గౌ. భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టుటకు విజయవాడ సభలో పాల్గొనుటకు విచ్చేయుచున్నారని, జిల్లా నుండి ప్రజలు సభకు వెళ్ళుటకు ఏర్పాట్లు జాగ్రత్తగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ బుధ, గురువారాల్లో అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడానికి గౌరవ ప్రధానమంత్రి రానున్న నేపథ్యంలో, రాష్ట్ర రాజధాని నిర్మాణంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజల భాగస్వామ్యం ఉండాలనే సత్సంకల్పంతో జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుండి పది బస్సులకు తగ్గకుండా ప్రజలను స్థానిక ప్రజా ప్రతినిధుల సమన్వయంతో అమరావతిలో జరిగే సదరు సభకు జాగ్రత్తగా జిల్లా నుండి తీసుకెళ్లి తిరిగి వారిని సురక్షితంగా తీసుకురావాల్సి ఉంటుందని అందుకు సంబంధించి మొత్తం ఏర్పాట్ల సమన్వయం జెసి శుభం బన్సల్ చూడాలని సూచించారు. అలాగే జిల్లాలోని ఏడు నియోజకవర్గ ప్రత్యేక అధికారులు వారి వారి నియోజకవర్గం నుండి ప్రజలను సదరు సభకు పూర్తి సౌకర్యాలతో తరలించే బాధ్యత చూసుకోవాలని, ప్రతి వాహనానికి ఒక పాయింట్ పర్సన్, అలాగే ప్రతి వాహనానికి ఇద్దరు డ్రైవర్లు ఉండేలా చూడాలని అన్నారు. బస్సులు ఏర్పాటు రీజనల్ మేనేజర్ ప్రజా రవాణా శాఖ, జిల్లా రవాణా శాఖ అధికారి సమన్వయంతో పని చేయాలని సూచించారు.

నేటి రాత్రి బస్సులు బయలుదేరాలని ఉదయం అల్పాహారం సమావేశానంతరం మరియు రాత్రి తిరిగి తిరుపతి జిల్లాకు చేరేవరకు వారికి భోజన త్రాగునీరు తదితర ఏర్పాట్లు ఉంటాయని సమన్వయం చేయాలని తెలిపారు.

ఈ టెలి కాన్ఫరెన్స్ నందు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, సంబంధిత జిల్లా అధికారులు, రెవెన్యూ, మండల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *