మంగళగిరి మండల ప్రజానీకానికి పోలీసువారి విజ్ఞప్తి మరియు సూచనలు

-మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
మండలంలో ఈ మధ్యకాలంలో ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నందున ప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా గ్రామంలో ఉన్న ప్రజలు మీరు బయట ఊళ్ళకు కి వెళ్లేటప్పుడు అనగా తీర్థయాత్రలకు, విహారయాత్రలకు, పెళ్లిళ్లకు , మొదలగువాటికి వెళ్ళేటప్పుడు సదరు విషయాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్ లో తెలియపరచవలసిందిగా మరియు LHMS (locked house monitoring system) వారికి తెలియపరిచిన ఎడల వారు వచ్చి మీ ఇంటికి LHMS ను అమర్చి వెళతారు ఈ రకంగా దొంగతనం అరికట్టగలము, అలాగే సదర విషయాన్ని 100, 112 కు డయల్ చేసి తెలపగలరని గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు. అలానే ద్విచక్ర వాహన దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతున్నందున మీ యొక్క ద్విచక్ర వాహనాలను ఇంటి ముందు పార్కు చేసేటప్పుడు హ్యాండిల్ లాక్ మరియు గొలుసు సహాయంతో లాక్ చేయగలరని తెలియపరచడమైనది. కావున మంగళగిరి మండల ప్రజలు పోలీసు వారికి సహకరించాలని మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *