Breaking News

రాష్ట్రంలో తిరుపతి జిల్లా స్థూల జాతీయోత్పత్తి లో మూడవ స్థానంలో ఉంది రాబోయే రోజుల్లో మొదటి స్థానానికి వచ్చేలా కృషి చేయాలి

-జిల్లాలో పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి : రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ చీఫ్ సెక్రటరీ మరియు ఇన్చార్జ్ జోనల్ ఆఫీసర్ ఎం.టి కృష్ణ బాబు
-రాష్ట్రంలో జిల్లాని అభివృద్ధి లో ప్రథమ స్థానంలో నిలిపేలా అధికారులు కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో తిరుపతి జిల్లా స్థూల జాతీయోత్పత్తి లో మూడవ స్థానంలో ఉంది రాబోయే రోజుల్లో మొదటి స్థానానికి వచ్చేలా కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు ఇన్చార్జ్ జోనల్ ఆఫీసర్ ఎం.టి కృష్ణ బాబు తెలిపారు.

మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా సమగ్ర అభివృద్ధికి సంబంధించిన వివిధ శాఖల ద్వారా అమలవుతున్న పథకాల అమలుపై రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు జోనల్ ఇంచార్జ్ అధికారి ఎం టి కృష్ణ బాబు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తిరుపతి జిల్లా స్థూల జాతీయోత్పత్తి లో మూడవ స్థానంలో ఉంది రాబోయే రోజుల్లో మొదటి స్థానానికి వచ్చేలా సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన పారిశ్రామికవేత్తలకు మన జిల్లాలో ఉన్న వనరులు, అవకాశాల గురించి తెలియజేసి పరిశ్రమలు నెలకొల్పేలా ఆకట్టుకోవాలన్నారు. మన జిల్లాలో హోటల్ టూరిజం, మెడికల్ టూరిజం కేరళ తరహాలో మన జిల్లాలో కూడా నెలకొల్పడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా తిరుపతి జిల్లాలో కూడా మెడికల్ టూరిజం ను తిరుపతి జిల్లాలో అభివృద్ధి పరిచేలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆకాంక్షించారు. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో మెడికల్ టూరిజం, లీజర్ టూరిజం, స్పిరిచ్యువల్ టూరిజం అభివృద్ధి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. సోలార్ ప్రాజెక్టుకు సంబంధించి ఎస్.సి, ఎస్.టి వారు లబ్ధి పొందేలా చూడాలని తెలిపారు. జిల్లాలో పరిశ్రమలకు అనుగుణంగా అధునాతన నైపుణ్య శిక్షణ ఇచ్చి నైపుణ్య అభివృద్ధిని పెంచుకునేలా మెలకువలను పాటించాలని తెలిపారు.
పరిశ్రమలకు తగ్గ మ్యాన్ పవర్ ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. హార్వెస్టింగ్ అనే అధునాతన సాంకేతికను ఉపయోగించి పంట దిగుబడి లో అధునాతన పద్ధతులను పాటిస్తూ పంట దిగుబడులను పెంచుకోవాలన్నారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ చీఫ్ సెక్రటరీ వారు ఇచ్చిన సలహాలను తప్పకుండా పాటిస్తు, ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష మేరకు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేలా జిల్లా యంత్రాంగం అహర్నిశలు కృషి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా అధికారులు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని. అనుకున్న సమయంలోపు లక్ష్యాలను పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు ఇంకా అభివృద్ధి చెందాలంటే చాలా అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకొని జిల్లాను అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలిపేలా చూడాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నరసింహులు, మునిసిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ట్రైన్ ని కలెక్టర్ సందీప్ రఘు వాన్షి, సూళ్లూరుపేట, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డిఓలు కిరణ్మయి, రామ్మోహన్ రెడ్డి, భాను ప్రకాశ్ రెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *