Breaking News

గంగిరెడ్డి పల్లె విలేజ్ హెల్త్ క్లినిక్ ను సందర్శన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం చంద్రగిరి నియోజకవర్గం, రామచంద్రా పురం మండలం గంగిరెడ్డి పల్లె విలేజ్ హెల్త్ క్లినిక్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ ఆఫీసర్ మరియు జోనల్ ఇన్చార్జి అధికారి ఎం. టి కృష్ణబాబు, కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వీర పాండ్యన్, జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తో కలిసి సందర్శించారు. ఎన్ సి డి సర్వే ద్వారా ఎన్ని కుటుంబాలు కవర్ అయ్యాయని వైద్య సిబ్బందిని ఆరా తీశారు. ఎన్ సి డి సర్వే ద్వారా బి.పి, షుగర్, థైరాయిడ్ పలు పరీక్షలను నిర్వహించి ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాలన్నారు. పరీక్షలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి మందులు పంపిణీ చేయాలన్నారు. 104 అంబులెన్స్ ద్వారా రెగ్యులర్ గా వైద్య పరీక్షలు నిర్వహించాలి. క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించి క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించి, వారిని హాస్పిటల్ కు పంపించి వైద్యం అందించాలని సూచించారు. విలేజ్ హెల్త్ క్లినిక్ నందు బిపి, షుగర్, థైరాయిడ్ కు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. టెలి మెడిసిన్ ద్వారా మందులు సరఫరా చేస్తున్నారా అని మెడికల్ సూపరింటెండెంట్ ని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది అంగన్వాడి సెంటర్లను సందర్శించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. డెంగ్యూ, మలేరియా కి సంబంధించిన టెస్టింగ్ కిట్స్ ను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, హాస్పిటల్కు వెళ్లలేని వారు టెలి మేడిసన్ హబ్ కి కాల్ చేసి ఆన్లైన్ ద్వారా మందులను ఇంటి వద్దనే పొందేలా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని డిఎంహెచ్వో ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్షి, తిరుపతి ఆర్ డి ఓ రామ్మోహన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బాలకృష్ణ నాయక్, డిసిహెచ్ ఆనందమూర్తి , ఏఎన్ఎం లు, ఆశ వర్కర్లు, సచివాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *