ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రథమ స్థానం సాధించిన గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని గంగోత్రి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బొమ్మూరు గిరిజన ఆశ్రమ వసతి గృహ విద్యార్థిని ఎస్. గంగోత్రి 540 మార్కులు సాధించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం ఇటీవల విడుదల చేసిన 10 వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులను రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఎన్ ఎన్ నాయక్, డైరెక్టర్ ఎస్. భార్గవి చేతులు మీదుగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థిని ఎస్ . గంగోత్రి కి అవార్డ్, ప్రశంసా పత్రం అందజేశారు. ఇటీవల విడుదల చేసిన 10 వ తరగతి పరీక్షా ఫలితాలలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న అన్ని గిరిజన ఆశ్రమ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులలో 540 అత్యధిక మార్కులు సాధించి ప్రధమ స్థానం లో నిలిచినట్లు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె ఎన్ జ్యోతి తెలియ చేశారు. వసతి గృహంలో చదువుకుంటూ, అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం లో చక్కటి ఫలితాలు సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచారని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఇదే స్పూర్తి మరింత మందికి ప్రేరణ పొందడం లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం తరపున సన్మానించడం జరిగిందన్నారు. గంగోత్రి నీ అభినందించిన వారిలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె ఎన్ జ్యోతి, గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ ఇందిరా తదితరులు ఉన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *