Breaking News

నానో ఎరువుల వినియోగం పై రైతులకు మరింత అవగాహన కల్పించాలి…

-డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు
-వ్యవసాయం రంగంలో నానో సాంకేతిక పరిజ్ఞానం పై విజయవాడ లో జరిగిన రాష్ట్ర స్థాయి కార్యశాల 
-మాస్టర్ ట్రైనీలు ,శాస్త్రవేత్తలు ,వ్యవసాయ అధికారులతో సాంకేతిక చర్చా కార్యక్రమం 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ మినర్వ హోటల్ నందు బుధవారం ఇఫ్కో సంస్థ నిర్వహించిన నానో సాంకేతిక పరిజ్ఞానం ,వ్యవసాయంలో వాటి వినియోగం అనే అంశంపై 26 జిల్లాల మాస్టర్ ట్రైనీ లతో జరిగిన రాష్ట్ర స్థాయి సాంకేతిక కార్యశాలలో డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు పాల్గొన్నారు .
ప్రారంభ ఉపన్యాసం ఇస్తూ ఇఫ్కో సంస్థ సహకార రంగములో ప్రపంచస్థాయిలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు .అటువంటి సంస్థ నుండి తయారుచేయబడి ,పేటెంట్ హక్కులను పొందిన నానో ఎరువుల అయిన నానో యూరియా ,నానో డిఎపి ల పై పూర్తి స్థాయి అవగాహన కలిగి వుండి,రైతులకు మరింత సులభతరంగా అవగాహన కల్పించాలని కోరారు . గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆత్మ నిర్భర భారత్ లో భాగముగా ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా ఇఫ్కో ముందు వరసలో నిలిచిందని తెలిపారు . వివిధ పంటలలో నానో ఎరువుల వినియోగం దిగుబడుల పై ప్రభావం అనే అంశములను ప్రత్యక్షముగ రైతులు పరిశీలించుకోవటానికి ప్రతి జిల్లాలో ఒక ప్రదర్శన క్షేత్రము చొప్పున రాష్ట్రములో 26 క్షేత్రములను ఈ ఖరీఫ్ 25 నుండి ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు.
మన దేశంలో ఎరువుల తయారీకి ముడి సరకులైన భాస్వరం ను దిగుమతి చేసుకోవటానికి పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం ఎక్కువ సంఖ్యలో ఖర్చు అవుతున్నదని ,వాటిని తగ్గించే విషయములో ఈ నానో ఎరువుల వినియోగం ద్వారా ప్రభుత్వం ముడి సరకుల దిగుమతి కోసం విదేశాలపై ఆధార పడటం తగ్గుతుందందని తెలిపారు .పర్యావరణానికి , నేలలకు హాని కలగకుండా వుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ తరుణేందు సింగ్ , ఇఫ్కో శాస్త్రవేత్త మాట్లాడుతూ నానో సాంకేతిక పరిజ్ఞానం పై ,వారి సంస్థ పరిశోధన ఫలితాలపై అవగాహన కల్పించారు.
డాక్టర్ భరత లక్ష్మీ ,శాస్త్రవేత్త ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మాట్లాడుతూ నానో ఎరువుల ను వివిధ పంటలపై ప్రయోగాలు జరుగుతున్నాయని తెలిపారు .రాష్ట్ర ఇఫ్కో సంస్థ మార్కెటింగ్ మేనేజర్ మాట్లాడుతూ రైతులకు ఇఫ్కో ఎరువుల కొనుగోలుపై సంకట హరణ భీమా పథకం ను ఉచితముగా అందిస్తున్నామని ,వాటి వివరములను తెలిపారు .
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు టి ప్రసాద్ ,శైలజ ,నాగమాధురి , సి హెచ్ శ్రీనివాస్ పాల్గొనీ అనుమానాలను నివృత్తి చేశారు .
అదనపు వ్యవసాయ సంచాలకులు శ్రీధర్ ,వినయ్ చంద్, జిల్లాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమమునకు సంయుక్త సంచాలకులు కృపదాస్ సమన్వయ కర్త గా వ్యవహరించారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *