విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్ టాఫ్ లను మరియు స్మార్ట్ ఫోన్ లను జిల్లా జాయింట్ కలెక్టర్ బన్సల్ తో కలసి అందజేసిన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాలోని తిరుపతి పార్లమెంట్ పరిధిలో గల విభిన్న ప్రతిభావంతులకు జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు తో కలసి జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ ల్యాప్ టాప్ లు మరియు స్మార్ట్ ఫోన్ లను అందజేశారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టరేట్ నందు విభిన్న ప్రతిభావంతులకు సుమారుగా రూ. 13,92,000/- విలువ గల 24 ల్యాప్ టాఫ్ లు,(ఒక ల్యాప్ టాఫ్ విలువ 42,000), 24 టచ్ ఫోన్లను (ఒక టచ్ ఫోన్ విలువ రూ.16,000లు) జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు,విభిన్న ప్రతిభా వంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడి ఏ వై శ్రీనివాసులు, సి ఆర్ అండ్ ఎమ్. ఓ జి. కె. రాజశేఖర్, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *